Begin typing your search above and press return to search.
సంచలనంగా ఎమ్మెల్యే కుమార్తె.. సినీ డైరెక్టర్ పెళ్లి
By: Tupaki Desk | 9 March 2018 5:10 AM GMTసినిమాటిక్ గా జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు పొరుగన ఉన్న కర్ణాటకలో జరిగిన ఈ లవ్ మ్యారేజ్ ఆ రాష్ట్రంలో సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సస్పెన్స్ ను తలపించేలా సాగిన ఈ పెళ్లి విషయంలోకి వెళితే..
కర్ణాటకలోని దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మీ. ఆమెకు.. సినిమా డైరెక్టర్ సుందర్ గౌడ్ కు గడిచిన ఆర్నెల్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరువురు ఒక అంగీకారం వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే.. వారి ఇళ్లల్లో ఉన్న ఇబ్బందితో గుట్టుగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి అబ్బాయి తరఫు వారు ఓకే అన్నా.. అమ్మాయి తల్లిదండ్రులు నో చెప్పటంతో ఈ ఇష్యూ పెద్దదైంది.
ఇంట్లో వారికి తెలీకుండా బయటకు వచ్చేసిన ఎమ్మెల్యే కుమార్తె.. సినిమా డైరెక్టర్ ను గుట్టుగా మైసూర్ లోని చాముండి కొండ వద్ద పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తన కుమార్తె కనిపించటం లేదంటూ ఎమ్మెల్యే శివమూర్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విషయాన్ని గుర్తించి.. పెళ్లి కొడుకు తరఫు బంధువుల్ని అదుపులోకి తీసుకున్నారు. కొత్త జంట ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పెళ్లి కుమార్తె తండ్రి పలుకుబడి.. పోలీసుల తీరుతో భయపడిపోయిన కొత్తజంట తమ పెళ్లి తమ ఇద్దరి ఇష్టపూర్వకంగా జరిగిందని.. తాము మేజర్లమన్న విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియా సంచలనంగా మారటంతో ఈ వ్యవహారంలో పోలీసులు ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా తెలుస్తోంది. తాము ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని.. తమను ఏమీ చేయొద్దని వారిరువురు వేడుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త జంట మైసూర్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.