Begin typing your search above and press return to search.
ప్రాణత్యాగానికైనా అరుణమ్మ సిద్ధమట
By: Tupaki Desk | 15 Feb 2016 4:29 AM GMTరాజకీయం నేతల నోటి నుంచి ఎంతటి మాటలైనా అనేలా చేస్తుంది. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనూ ప్రాణత్యాగం మాటను మాట్లాడని మాజీ మంత్రి డీకే అరుణమ్మ ఇప్పుడు కొత్త మాటల్ని మాట్లాడుతున్నారు. గద్వాల జిల్లా కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని తేల్చి చెబుతున్నారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. రిలే నిరాహార దీక్షలు షురూ అయ్యాయి.
ఈ దీక్షల్ని ప్రారంభించటానికి వచ్చిన అరుణమ్మ మాట్లాడుతూ.. గద్వాలను జిల్లా కేంద్రంగా చేయటాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పిన ఆమె.. గద్వాలను జిల్లాగా చేపట్టటం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయటానికైనా తాను సిద్ధంగా ఉన్ననని పేర్కొనటం గమనార్హం. గద్వాల జిల్లా సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారు ప్రాణత్యాగం పదాన్ని ప్రయోగించటంతో.. అరుణమ్మ కలగజేసుకొని.. యువకులు ఆవేశంగా ప్రాణత్యాగమంటున్నారని.. మీరెందుకు నేను ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నానంటూ అరుణమ్మ వ్యాఖ్యానించారు.
అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో కూడా ఈ తరహాలో మాట్లాడని అరుణమ్మ ఇప్పుడు మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇక.. ఈ ఎపిసోడ్ లో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు నమ్మకాన్ని ప్రస్తావించిన ఆమె.. తెలంగాణకు నైరుతి భాగంలో ఉన్న గద్వాలను జిల్లా చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మరి.. డీకే అరుణ వాస్తు నైపుణ్యానికి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.