Begin typing your search above and press return to search.
భీమ్లా నాయక్ కామెంట్స్ ద్వారం పూడి కౌంటర్ ?
By: Tupaki Desk | 15 March 2022 3:28 PM GMTనిన్నటి జనసేన ఆవిర్భావ వేళ పలు ఆసక్తికర వ్యాఖ్యలు తీవ్ర భావావేశ సంబంధ వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.ఇవన్నీ ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం ఉద్దేశం కన్నా వైసీపీనే ఎక్కువగా పవన్ టార్గెట్ చేయడం వెనుక తొలిసారి రాజకీయ చతురత అన్నది కనపడిందని కొందరు జగన్ అభిమానులు సోషల్ మీడియాలో అంటున్నారు.
అది జనసేన సభ కాదని ఏక వీర సభ లా ఉందని కూడా ఇంకొందరు వైసీపీ సానుకూల వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు.ఇవన్నీ ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి చర్చకు తావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి,ఆయన వర్గీయులకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఉంటుందని, గతంలో ఈ కుటుంబానికి డీటీ నాయక్ ట్రీట్మెంట్ అందిందని అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్రావనిలో చర్చకు తావిస్తున్నాయి. ఒక్కద్వారంపూడినే కాదు మంత్రులు వెల్లంపల్లిని,అవంతిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో ద్వారంపూడి స్పందిస్తూ లక్షల్లో జనాలను తాకట్టు పెట్టే సంస్కృతి పవన్ దేనని, కొందరు లక్షలు ఖర్చుచేస్తున్నారని అవేవీ ఫలితం ఇవ్వవని అంటూనే తన వెంట్రుకను టచ్ చేయలేరని సినిమా హీరో రేంజ్ లో డైలాగులు చెబుతున్నారు. వాస్తవానికి గతంలో పవన్ ను ద్వారంపూడి అనరాని మాటలు అన్నారు.
ఆ సందర్భంలో జనసైనికులు,వీర మహిళలు స్పందించారు. అప్పుడు వీర మహిళలపై ద్వారం పూడి అనుచరులు దాడి చేశారు.అవన్నీ పవన్ మనసులో ఉన్నాయి.వీటినే దృష్టిలో ఉంచుకుని పవన్ అన్న మాటలపై ద్వారంపూడి విరుచుకుపడ్డారు.మీ కార్యకర్తలూ నాయకులూ నా ఇంటికి వస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరిస్తూ కొన్ని రాయలేని భాషలో మాటలు పలికారు.