Begin typing your search above and press return to search.

సొమ్ము కేంద్రానికి ..సోకు కేసీఆర్ ది : ఎమ్మెల్యే ఈటెల

By:  Tupaki Desk   |   18 Nov 2021 6:37 AM GMT
సొమ్ము కేంద్రానికి ..సోకు కేసీఆర్ ది : ఎమ్మెల్యే ఈటెల
X
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం కాకరేపుతోంది. బీజేపీ, టీఆర్ ఎస్, మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. సెంటిమెంట్ మీద ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌ కు లేదని, నిధులు కేంద్రానివి.. ఫొటోలు సీఎం కేసీఆర్‌ వినని ఈటల ఎద్దేవా చేశారు.

కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి రాష్ట్రంలో లేదని విమర్శిలు చేశారు. ఎన్ని పథకాలు, ప్రలోభాలకు గురి చేసినా కూడా హుజురాబాద్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారు. తన గెలుపుతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు.

హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ రూ. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. నేతలుగా ఎదిగే వారికి హుజురాబాద్ ఒక ప్రయోగశాలగా మారిందని ఈటల రాజేందర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఏమైంది అని ఈటల రాజేందర్ అంతకుముందు ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలి అని పేర్కొన్నారు. అన్నీ అబద్దలేనని విమర్శించారు.

ఇక ఇదిలా ఉంటె .. మన రాష్ట్ర రైతాంగం పండిచినంటువంటి వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర‌ ప్ర‌భుత్వం ద్వంద్వ‌ ప్ర‌మాణాలు పాటిస్తోంది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి వ‌చ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మాత్రమే ఈ మహా ధర్నా రావాలని నిర్ణయించినప్పటికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా ధర్నాచౌక్‌ కు తరలివస్తున్నారు.