Begin typing your search above and press return to search.
అమ్మకోసం ఐదేళ్ల జీతాన్ని ఏం చేశాడో తెలుసా?
By: Tupaki Desk | 22 April 2016 7:12 AM GMTపురుట్చితలైవి (విప్లవనాయకి) అన్న బిరుదుతో రాజకీయాల్లోకి వచ్చినా.. అమ్మ బిరుదుతో కొనసాగుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మనసును దోచుకోవటం అంత చిన్న విషయం కాదు. ఆమె మనసును దోచుకోవటానికి అన్నాడీఎంకే పార్టీ నేతలు కిందామీదా పడుతుంటారు. పెద్ద పెద్ద నాయకులు సైతం అమ్మ ముందు ఒదిగి ఉంటారు. జాగ్రత్తగా మసులుకుంటారు. అమ్మ మనసుకు ఎలాంటి కష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మకు ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా క్షణాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునే వీలు ఉండటంతో అలాంటి అవకాశమే లేకుండా ఉంటారు.
తాజాగా అమ్మ మనసును దోచుకోవటానికి ఒక ఎమ్మెల్యే తీసుకునే జాగ్రత్తలు చూస్తే ఔరా అనుకోవాల్సిందే. సాధారణంగా అధినేతల మనసుల్ని దోచుకోవటానికి ఏదైనా కార్యక్రమం చేపడితే అధినేత దృష్టికి నామమాత్రంగా తీసుకొచ్చి ప్రచార సాధనాల ద్వారా ఆయన కంట్లో పడాలని భావిస్తారు. కానీ.. అమ్మ విషయంలో ఈ విషయం పూర్తి రివర్స్. తాము చేసే ప్రతి పనిని అమ్మకు చెప్పి.. ఆమె అనుమతించిన తర్వాత.. ఆమె కోరుకున్నట్లే చేయాలి.
2011లో అసెంబ్లీ ఎన్నికల్లో తిరువీక నగర్ అసెంబ్లీ స్థానం నుంచి నీలకంఠన్ అనే పెద్దాయన పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాదాపు 70 ఏళ్ల వయసున్న ఆ పెద్ద మనిషికి అమ్మ అంటే అంతులేని అభిమానం. ఆమె ఆరోగ్యం చల్లగా ఉండాలని ఆయన గడిచిన ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా తనకొచ్చిన జీతాన్ని జాగ్రత్తగా దాస్తున్నాడు. వాటితో.. వెండి కవచం చేయించి.. శ్రీకాళహస్తీశ్వరుడికి మొక్కుగా చెల్లించాలని అనుకున్నాడు.
ఇలాంటి వాటికీ అమ్మ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అందుకే అమ్మ దగ్గరకు వెళ్లి విషయం చెబితే.. ఆమె ఓకే అనేశారు. దీంతో ఎగిరి గంతేసిన ఆయన అమ్మ సూచనలకు తగ్గట్లే వెండి కవచం పనులు చేయించటం మొదలు పెట్టారు. 68 ఏళ్ల అమ్మ వయసును దృష్టిలో పెట్టుకొని 68 కేజీలతో ఈ వెండి కవచాన్ని తయారు చేయించారు. అయితే.. వెండికవచం తయారీ పూర్తి అయ్యే నాటికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటంతో తన మొక్కును ఎన్నికలు పూర్తి అయ్యాక చెల్లించాలని భావిస్తున్నారు. ఇలాంటి విదేయులైన ఎమ్మెల్యేలు అమ్మకు ఎంత మందో..?