Begin typing your search above and press return to search.
గోరంట్లలో అసంతృప్తే లేదట
By: Tupaki Desk | 21 Aug 2021 2:07 AM GMT‘సీనియర్ నేత, ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరిలో ఎలాంటి అసంతృప్తిలేదు’ ..ఇవి గోరంట్లతో భేటీ తర్వాత మరో సీనియర్ నేత, ఎంఎల్ఏ గద్దె రమ్మోహన్ రావు మీడియాతో చెప్పిన మాటలు. గోరంట్లలో ఎలాంటి అసంతృప్తిలేదని, పార్టీ లోపేతానికి సంబంధించి ఆయన కొన్ని అభిప్రాయాలను వ్యక్తంచేశారని, వాటిన్నింటిన్నీ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామంటు గద్దె చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. చంద్రబాబునాయుడు, లోకేష్ వ్యవహారశైలితో బుచ్చయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం.
తనలోని అసహనాన్ని బుచ్చయ్య దాచుకోవటానికి కూడా ఏరోజు ప్రయత్నించలేదు. తనలాంటి సీనియర్లను, పార్టీకోసం మొదటినుండి కష్టపడిన వారిని కాదని ఫిరాయింపులకు చంద్రబాబు అగ్రతాంబూలం ఇవ్వటంపై బహిరంగంగానే మండిపడ్డారు. వైసీపీ నుండి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవటాన్ని మీడియా ముందే బుచ్చయ్య తప్పుపట్టారు.
అలాగే ఈమధ్య చంద్రబాబు నియమించిన జాతీయ, రాష్ట్ర కమిటిలతో పాటు పాలిట్ బ్యూరోలో కూడా సీనియర్లను పక్కనపెట్టేశారంటూ గోరంట్ల తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనలోని అసంతృప్తిని చెప్పుకోవటానికి ఎంత ప్రయత్నించినా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో ఇక లాభంలేదనే రాజీనామా అస్త్రాన్ని సంధించారు. దాని దెబ్బకు చంద్రబాబు కిందామీదా అయిపోయి తానే స్వయంగా రెండుసార్లు బుచ్చయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు.
అంటే రాజీనామా అస్త్రాన్ని సంధిస్తేకానీ బుచ్చయ్యతో చంద్రబాబు మాట్లాడటానికి ఇష్టపడలేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని తనతో భేటీ అయిన పార్టీ నేతల వద్ద నిలదీసినట్లు సమాచారం. తాను ఫోన్ చేస్తే చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడటంలేదని నేతల బృందాన్ని బుచ్చయ్య సూటిగా ప్రశ్నించారు. బుచ్చయ్య ప్రశ్నకు వీళ్ళదగ్గర ఎలాంటి సమాధానం లేదు. గోరంట్లలోని అసంతృప్తిని, అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని హామీఇచ్చారంతే.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతు గోరంట్లలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజంగానే గోరంట్లలో అసంతృప్తే లేకపోతే ఇంతమంది నేతలు బుచ్చయ్య ఇంటికి ఎందుకువస్తారు ? బుచ్చయ్య పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుగనుకే చంద్రబాబు కూడా టెన్షన్ పడి వెంటనే నేతల బృందాన్ని బుచ్చయ్య ఇంటికి రెండుసార్లు పంపారు.
చంద్రబాబు పిలిచినా చర్చలకు వచ్చేది లేదని తెగేసి చెప్పారంటేనే బుచ్చయ్యలో చంద్రబాబు, లోకేష్ అంటే ఎంతమంటగా ఉందో అర్ధమైపోతోంది. మొత్తానికి బుచ్చయ్య అసంతృప్తి టీకప్పులో తుపాను లాగే చల్లారిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి. చూద్దాం చివరకు ఏమవుతుందో.