Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో లాక్ డౌన్ వద్దంటూ.. బిచ్చమెత్తిన ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   11 April 2021 9:35 AM GMT
రాష్ట్రంలో లాక్ డౌన్ వద్దంటూ.. బిచ్చమెత్తిన ఎమ్మెల్యే!
X
మహారాష్ట్రలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎంతగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ.. కేసుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. దీంతో.. వీకెండ్ లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. కరోనా ఉధృతి ఆగ‌ట్లేదు. దీంతో.. పూర్తిస్థాయి లాక్ డౌన్ అమ‌లు చేయాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే.. మ‌హారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే, మ‌రో మంత్రి విజ‌య్ వ‌డ్డే టివ‌ర్ లాక్ డౌన్ అంశాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకె‌ళ్లారు. ఇంకా ప‌లువురు మంత్రులు కూడా లాక్ డౌన్ ను స‌మ‌ర్థిస్తున్నారు. అలాగైతేనే.. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి సాధ్య‌మ‌వుతుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే.. ఈ నిర్ణ‌యాన్ని ప‌లువురు వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రోసారి లాక్ డౌన్ విధిస్తే ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ ఎంపీ ఉద‌య్ భోస్లే లాక్ డౌన్ కు నిర‌స‌న‌గా బిచ్చ‌మెత్తారు. లాక్ డౌన్ విధిస్తే వ్యాపారాల‌న్నీ దెబ్బ‌తింటాయ‌ని, పేద‌లు తిండి దొర‌క్క అల్లాడుతార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అందువ‌ల్ల‌.. ప్ర‌భుత్వం లాక్ డౌన్ ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని కోరారు. తాను బిచ్చ‌మెత్త‌గా వ‌చ్చిన రూ.450 జిల్లా అధికారుల‌కు అంద‌జేశారు. లాక్ డౌన్ విధించొద్ద‌న్న విన్న‌పాని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కోరారు. కాగా.. లాక్ డౌన్ విధింలా వ‌ద్దా? అన్న విష‌య‌మై ఇవాళ మ‌హారాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యించ‌నున్నారు.