Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి-35 వేల చొక్కా.. ఏంటీ వివాదం?
By: Tupaki Desk | 13 Sep 2022 12:44 PM GMTనిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలను వేడెక్కించే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి టాక్ ఆఫ్ దిన్యూస్‌గా నిలిచారు. అయితే.. ఈ సారి.. ఆయన రాజకీయాల పరంగా కాకుండా.. ఈసారి ఆయన వెరైటీగా వివాదంలో నిలిచారు. అదేంటంటే.. ఆయన ధరించిన ఖరీదైన చొక్కానే. ఏకంగా 35 వేల రూపాయల అత్యంత ఖరీదైన చొక్కాను జగ్గారెడ్డి ధరించారు. దీంతో ఈయన వ్యవహారం.. మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత.. భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన 41 వేల విలువైన టీషర్ట్‌పై తీవ్ర వివాదం తెరమీదికి వచ్చింది.
ఇప్పుడు తాజాగా రాహుల్ మాదిరిగానే జగ్గారెడ్డి ధరించిన చొక్కాపైనా.. రాజకీయంగా ఆసక్తికర వివాదం తెరమీదికి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంంటే.. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు మంగళవారం జగ్గారెడ్డి హాజరయ్యారు.
సాధారణంగా ఆయన పెద్దగా కట్టు బొట్టుకు ప్రాధాన్యం ఇవ్వరు. సాధారణ దుస్తులే ధరిస్తతారు. అయితే.. మంగళవారం ఆయన మెరిసిపోయారు. ` కెన్జో షర్ట్`(అత్యంత ఖరీదైన) ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఎప్పుడు తెలుపు షర్ట్ లేదంటే టీ షర్ట్‌తో వచ్చే జగ్గారెడ్డి క్యాజువల్‌లో రావడంతో అందరి దృష్టీ ఆయనపై పడింది.
ముఖ్యంగా జగ్గారెడ్డి చేసే వ్యాఖ్యల నేపథ్యంలో ఎప్పుడూ.. ఆయనను అనుసరించే మీడియా..ఈ విషయాన్ని పసిగట్టి.. ఆయన వెంట పడింది. జగ్గారెడ్డి ధరించిన షర్ట్ ధర ఎంతంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఎలాంటి తడబాటు లేకుండా.. `రూ.35 వేలని` జగ్గారెడ్డి ఠక్కున సమాధానం చెప్పారు. దీంతో అంత ధర ఉంటుందా? అంటూ పాత్రికేయులు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే స్పందించిన జగ్గారెడ్డి.. `ఏదైనా డౌట్ ఉంటే గూగుల్‌లో ప్రైస్ చెక్ చేసుకోండి` అని ఉచిత సలహా ఇచ్చారు.
ఇంకేముంది.. వెంటనే మీడియా ప్రతినిధులు డ్రెస్ ధర కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇదిలావుంటే.. ఆవెంటనే రియాక్ట్ అయిన జగ్గారెడ్డి ‘‘నేను విలువైన షర్ట్ వేసుకోకూడదా.. జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వేసుకోవాలా’’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. చొక్కాలు లేకపోవడంతో తన కుమారుడి షర్ట్ వేసుకుని వచ్చానని జగ్గారెడ్డి తీరగ్గా అసలు విషయం బయటపెట్టారు. దీంతో మీడియా మిత్రులు మరింత ఆశ్చర్య పోయారు. ఇక, ఇటీవల రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద బీజేపీ నేతలు చర్చ చేసిన విషయం తెలిసిందే. దీనిపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. రాహుల్‌కు రూ.40 వేల టీ షర్ట్ వేసుకునే స్థోమత లేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చకావాలా.. లేక మేం వేసుకునే బట్టలపై చర్చ కావాలా? అంటూ.. చురకలు అంటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.