Begin typing your search above and press return to search.
ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోపం అందుకేనా?
By: Tupaki Desk | 23 Aug 2021 10:02 AM GMTతెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మిగతా ప్రాంతంలోనూ ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు వాదనలు చేసుకోవడంతో జిల్లాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ పై ఎంపీ అరవింద్ చేస్తున్న విమర్శలకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. అయితే వీరు వాడే పదాల్లోనూ కొన్ని పరుష వ్యాఖ్యలు చేయడం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇన్నాళ్లు లేనిది వీరి మధ్య కొత్తగా యుద్ధం సాగడానికి కారణాలేమిటి..? ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఎందుకు స్పందిస్తున్నారు..? ఇలాంటి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఏంటంటే..?
2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ తరుపు ధర్మపురి అరవింద్ గెలిచారు. కొన్నాళ్లు అరవింద్ గురపించి ఎవరికీ తెలిసేది కాదు. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో ఎంపీ అరవింద్ ప్రత్యేకంగా నిలిచారు. తన పదునైన మాటలతో కార్యకర్తలను ఆకర్షించారు. ముఖ్యంగా కేసీఆర్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదు. అయితే ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు అప్పుడప్పుడు కొందరు నాయకులు కౌంటర్ చేసేవారు. కానీ ఆ తరువాత పెద్దగా పట్టించుకోలేదు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ధర్మపురి అరవింద్ ఇటీవల నియోజకవర్గంలో పర్యటించారు. బీజేపీ తరుపున ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీ పాలన గురించి వివరించారు. ఈ సమయంలో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక కేసీఆర్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ స్నేహ బంధం చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి అంటూ పరుష వ్యాఖ్యలు సంధించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కొందరు విరుచుకుపడ్డారు.
కానీ అరవింద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. అంతేకాకుండా ఒకే ఇంట్లో మూడు పార్టీలు పెట్టుకున్న నీవు ప్రజలకు ఏం సమాధానం చెబుతావ్ అంటూ విమర్శించారు. ముంచు ఇంట గెలువు.. ఆ తరువాత రచ్చ గెలుస్తావ్ అన్నారు. అంతేకాకుండా ప్రజలు సెంటిమెంట్ గా అనుకునే పసుపును అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచావన్నారు. పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసి మరీ రైతులను మోసం చేశావన్నారు. దమ్ముంటే పసపు బోర్డు సాధించి ఆ తరువాత మాట్లాడు.. అని జీవన్ రెడ్డి విమర్శంచారు. ఎంపీ అరవింద్ చెత్త మాటలు మాట్లాడడం మానుకోవాలని, సీఎం కేసీఆర్ స్థాయిని విమర్శించే హక్కు అరవింద్ కు లేదని అన్నారు. బీజేపీ లోఫర్ పార్టీ అని ఆ పార్టీ ఎంపీ కూడా లోఫర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ అరవింద్ కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. అయితే జీవన్ రెడ్డి ఇంతలా విరుచుకుపడడానికి కారణం వేరే ఉందట. అరవింద్ నిజమాబాద్ నుంచి అర్మూర్ కు మకాం మార్చనున్నాడు. ఇటీవల తన నివాసాన్ని కూడా ఇక్కడికి షిప్ట్ చేశాడట. ఎక్కువగా ఆర్మూర్ నియోజకవర్గంపైనే ఫోకస్ పెడుతున్నాడట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ అర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారని చర్చించుకుంటున్నారు. అయితే ఎంపీగా పసుపు బోర్డుతో గెలిచిన అరవింద్ ఈసారి ఎమ్మెల్యేగా ఎలాంటి హామీలతో గెలుస్తారోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.