Begin typing your search above and press return to search.

లేటెస్ట్ అప్డేట్ : కరోనా భారిన పడ్డ మరో తెలంగాణ ఎమ్మెల్యే !

By:  Tupaki Desk   |   29 July 2020 4:00 AM GMT
లేటెస్ట్ అప్డేట్ : కరోనా భారిన పడ్డ మరో తెలంగాణ ఎమ్మెల్యే !
X
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 60 వేలకి చేరువలో ఉంది. అలాగే రోజురోజుకి నమోదు అయ్యే కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం గ్రేటర్ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదు కాగా .. తాజగా తెలంగాణ జిల్లాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో కరోనా భారిన పడిన ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా ..తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైరస్ బారిన పడ్డారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

కరోనా పాజిటివ్ అని తెలియడంతో ,. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హోం ఐసోలేషన్‌ లో ఉండిపోయారని, ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారని ,. వారి ఫలితాలు ఇంకా రాలేదని , ప్రస్తుతం ఎమ్మెల్యే హోం ఐసోలేషన్‌ లో ఉంటూ కరోనా చికిత్స తీసుకుంటున్నారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. కాగా.. ఇప్ప‌టికే నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌రోనాబారిన‌ప‌డి కోలుకున్న సంగ‌తి తెలిసిందే.

రాష్ట్రంలో తొలుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకడంతో కలకలం రేగింది. ఆ తర్వాత మరో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గొంగిడి సునీత దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులకు కరోనా సోకింది. ఇక పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకుల భద్రతా సిబ్బంది, గన్‌ మెన్లకు కూడా కరోనా సోకడంతో వారంతా క్వారంటైన్‌ లోకి వెళ్లిపోయారు.