Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో తొలి తిరుగుబాటు

By:  Tupaki Desk   |   31 Aug 2019 11:28 AM GMT
టీఆర్ ఎస్ లో తొలి తిరుగుబాటు
X
టీఆర్ ఎస్ లో తొలి తిరుగుబాటు కలకలం మొదలైంది. నిన్న ఈటల రాజేందర్ శృతిమించి మాట్లాడిన మాటలు మరిచిపోకముందే మరో టీఆర్ ఎస్ అసంతృప్త ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం సంచలనంగా మారింది.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తాజాగా తన సన్నిహితులైన జడ్పీటీసీలు - ఎంపీపీలతో కలిసి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం టీఆర్ ఎస్ లో దుమారం రేపింది. ఇటీవల కోనప్ప తమ్ముడు విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమే ఈ తిరుగుబాటుకు కారణమని తెలుస్తోంది.

కొమురం భీం జిల్లా సార్సాలలో గిరిజనుల భూములు దున్నిన ఫారెస్ట్ అధికారులపై ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడి చేశాడు. ఫారెస్ట్ ఆఫీసర్ అనితపై హత్యయత్నం చేశాడు. ఇది దేశవ్యాప్తంగా ఇష్యూ కావడంతో కేసీఆర్ సర్కారు కోనేరు కృష్ణాను జైల్లో వేసి బెయిల్ రాకుండా చేసింది. రెండు రోజుల క్రితమే చాలా రోజుల తర్వాత కోనేరు కృష్ణ విడుదలయ్యాడు.

ఈ పరిణామాలతో కలత చెందిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప..ఆయన అనుంగ ప్రజాప్రతినిధులు ఏడుగురు జడ్పీటీసీలు - ఏడుగురు ఎంపీపీలు జిల్లా జడ్పీ సమావేశాన్ని బహిష్కరించడం టీఆర్ ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశానికి హాజరైనా కోనప్ప - జడ్పీటీసీలు హాజరు కాకపోవడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.