Begin typing your search above and press return to search.
దర్శి వైసీపీలో ముసలం.. అధిష్టానంపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 27 Aug 2022 3:53 AM GMTప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ వర్గపోరు మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తన వ్యతిరేక వర్గం సహా పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చామని ఇకపై సహించేది లేదన్నారు. పార్టీ, ప్రజల కోసం మూడేళ్లుగా ఎంతో పని చేస్తున్నానని, ఎన్నో అవమానాలు భరించానని చెప్పారు. తాను ఎవరి పదవీ లాక్కోలేదని అందరూ కోరితేనే ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు.
'ఇన్నాళ్లు అన్ని భరిస్తూ వచ్చాను... ఇక నుంచి సహించేది లేదుస అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా దర్శిలో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీలోని మరో వర్గంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇన్నాళ్లు భరిస్తూ వచ్చానని.. ఇకపై సహించేది లేదంటూ ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు. పార్టీ కోసం, ప్రజల కోసం ఎంత చేస్తున్నా కూడా.. మూడేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నోసార్లు తనను ఎంతో అవమానపరిచారని వాటన్నిటిని భరించానని, ఇక దేనికైనా సిద్ధం అంటూ బహిరంగ సభలో ధ్వజమె త్తారు. ''నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు.. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా కార్యకర్తలతో కొందరు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తనను ఒక సామాజికవర్గానికే ఆపాదిస్తున్నారు.. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో సహా.. రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ శాతం తన వెంటే ఉన్నారు'' అని వ్యాఖ్యానించారు.
దర్శిలో ప్రజల కోసం సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నప్పటికీ దానిపై కూడా రాజకీయం చేస్తున్నారని.. ఇప్పటికైనా అటువంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. తాను ఎవ్వరి పదవులు లాక్కోలేదని, అందరూ అడిగితేనే ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు.
కానీ కొంతమంది కావాలని తనను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సీఎం జగన్కు తనపై నమ్మకం ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానని, లేదంటే మద్దిశెట్టి వేణుగోపాల్గా ఉంటానని స్పష్టం చేశారు.