Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే బూతుల పందెం...నవ్విపోతారేమో కదా...!
By: Tupaki Desk | 22 Jan 2023 12:30 AM GMTబూతులు ఇపుడు కామన్ అయిపోయాయి. రాజకీయ నాయకుల నుంచి జనాలు విమర్శలను ఆశిస్తారు అయితే ప్రత్యర్ధి పార్టీలను శత్రువులుగా చూస్తున్న వాతావరణం ఏపీలో ఉంది. దాంతో విమర్శలు లేవు, అన్నీ తిట్ల దండకాలే. అవి కాస్తా ముదిరిపోయి బూతులకు తెర తీస్తున్నారు. నన్ను ఏమీ పీకలేవు. నా ఈక కూడా తెగదు ఇలాంటి చిల్లర మాటలు కూడా రాజకీయ నాయకుల నోటి నుంచి దొర్లుతున్నాయి.
అన్ని పార్టీలలో ఇపుడు ఈ ధోరణి ఉంది. ఇదే ఒక రకమైన ట్రెండ్ అనుకుని చాలా మంది మన మనసు చంపుకుని కూడా మాట్లాడుతున్నారు. ఫైర్ బ్రాండ్ అనిపించుకోవాలనే ఇలా చేస్తున్నారు అనుకోవాలి. విశాఖ జిల్లా నర్శీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ తన రాజకీయ ప్రత్యర్ధి తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మీద మాట్లాడితే ఒక లెవెల్ లో విరుచుకుపడతారు.
అయ్యన్నపాత్రుడుని ఉద్దేశించి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఏరా అయ్యన్నపాత్రుడు అంటూ ఫైర్ అవడం విశేషమే కాదు షాకింగ్ గానే అంతా చూస్తున్నారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించారు.
తాము అయ్యన్నపాత్రుడి కంటే బూతులు ఎక్కువగా మాట్లాడగలమని ఈ ఎమ్మెల్యే అంటున్నారు. అంటే బూతుల పందేనికి సై అంటున్నారు. నిన్నూ చంద్రబాబుని పట్టుకుని బూతులు తిట్టలేమా అంటూ పెట్ల గర్జించారు. ఎందుకని ఊరుకుంటున్నామని ఆయనే అంటున్నారు. బస్తీమే సవాల్ అయ్యన్న కంటే ఎక్కువ బూతులు తనకే వచ్చు అంటున్నారు ఈ ఎమ్మెల్యే.
మరి ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలియదు కానీ బూతులు ఎక్కువ వచ్చు అంటే అది క్రెడిట్ గా తీసుకోవాలా అన్నది జనం ఆలోచనగా ఉంది. అయ్యన్న మాజీ మంత్రి, సీనియర్ నేత. ఆయన బూతులు మాట్లాడినా జనాలు తప్పే అంటారు. మరి ఆయన మీద విరుచుకుపడుతూ వైసీపీ ఎమ్మెల్యే నీ కంటే నాలుగాకులు బూతులు ఎక్కువ చదివాను విప్పి చెప్పమంటావా అన్నా జనాలే వద్దు బాబోయ్ అంటారు.
అసలు ప్రజా ప్రతినిధులుగా నాయకులను ఎన్నుకున్నది ప్రజలకు మంచి చేయమని కానీ బూతుల పంచాయతీ పెట్టుకోమని కాదు కదా అని అంటున్నారు. నిజానికి చూస్తే రాజకీయ విమర్శల కంటే ఈ బూతుల పురాణాలే ఎక్కువ అయిపోయాయని జనాలు గగ్గోలు పెడుతున్నారు. నర్శీపట్నాన్ని గంజాయి అడ్డాగా అయ్యన్నపాత్రుడు చేశారు అని ఆరోపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే తన ప్రభుత్వంలో దాని నందనవనంగా ఎందుకు చేయలేకపోతున్నారు అని జనాల నుంచే ప్రశ్న వస్తోంది.
తప్పులు చేశారు కాబట్టే ముప్పయి వేల ఓట్ల తేడాతో అయ్యన్నను జనాలు ఓడించేశారు మరి గెలిచిన వారు గత ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం కంటే కూడా తాము చేయాల్సినమంచిని చేయవచ్చు కదా అని అంటున్నారు. మొత్తానికి అయ్యన్న వైసీపీ ఎమ్మెల్యేల మధ్య బూతుల పందెం వద్దే వద్దు అంటున్నారు. మరి మాట్లాడితే మీ కంటే నాకు బూతులు ఎక్కువ వచ్చు. చెప్పమంటారా అంటే ప్రత్యర్ధి పార్టీల సంగతేమో కానీ జనాలు జడుసుకుంటారని గుర్తుంచుకుంటే మంచిదేమో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.