Begin typing your search above and press return to search.

ఒక రిక్షా..ఒక మ‌జ్జిగ ఒండి..ఎఫ్‌ బీలో 500 లైక్‌ లు..ఇదేనా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జిమ్మిక్కు

By:  Tupaki Desk   |   14 April 2020 6:30 AM GMT
ఒక రిక్షా..ఒక మ‌జ్జిగ ఒండి..ఎఫ్‌ బీలో 500 లైక్‌ లు..ఇదేనా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జిమ్మిక్కు
X
ప‌రిస్థితులు ఎలాగైనా ఉండండి.. రాజ‌కీయ నాయ‌కులు అవేవీ ప‌ట్టించుకోరు. ఎప్పుడు త‌మ రాజకీయాలకు ప‌రిస్థితులను మ‌ల‌చుకోవ‌డ‌మే ల‌క్ష‌ణం. అదే త‌ర‌హాలో మొన్న క‌ర్నాట‌క‌లో ఓ ఎమ్మెల్యే ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు మృత‌దేహాన్ని చెట్టుపై నుంచి దించ‌కుండానే ఫొటోల‌కు పోజులిచ్చారు. ప‌రామ‌ర్శిస్తున్న‌ట్లు స్టిల్ ఇవ్వ‌డంతో స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ విధంగా చిత్ర‌విచిత్ర వేశాలు రాజ‌కీయ నాయ‌కుల‌కే చెల్లుతాయి. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కూడా అలాంటి ఎమ్మెల్యేనే ఒక‌రు ఉన్నారు. ఫొటోల కోసం.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కోసం లేని దాని ఉన్న‌ట్టు సినిమాల్లో మాదిరి ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏకంగా సోష‌ల్ మీడియాలో పబ్లిసిటీ కోసం లేని వాటిని ఉన్న‌ట్లు సృష్టించి వాటిని ఆస‌రాగా చేసుకుని ఫొటోల‌కు స్టిల్ ఇస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం చూసి ఆమె నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో పాటు నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని అధికార పార్టీ మ‌హిళ ఎమ్మెల్యే లాక్‌ డౌన్ ప‌రిస్థితుల‌తో ఇబ్బందులను ప‌రిష్క‌రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోక‌పోగా సినిమా స్టంట్లు చేస్తూ హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె లేని రిక్షాల‌ను సృష్టించారు. ఎందుకంటే లాక్‌ డౌన్ కొన‌సాగుతున్న వేళ ప‌ట్ట‌ణం న‌డిబొడ్డున రిక్షాలు న‌డుస్తున్నాయా లేవు. ఆమె సృష్టించిన రిక్షా బండి వ‌ద్ద‌కు ఆ ఎమ్మెల్యే వెళ్లి అత‌డిని ప‌ల‌క‌రించి రూ.వెయ్యి స‌హాయం చేసి హెచ్‌ డీ కెమెరాలు - వీడియోల‌తో తీయించి ఫేస్‌ బుక్ త‌దిత‌ర సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక అక్క‌డ కూడా పెయిడ్ లైక్స్ 500 నుంచి వెయ్యి దాక ఉంటాయి. ఈసారి న‌గ‌రం న‌డిబొడ్డున మ‌జ్జిగ బండి సృష్టించారు. ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ నేప‌థ్యంలో ఎలాంటి దుకాణాలు న‌డిరోడ్డుపై కొన‌సాగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే ఆ మ‌జ్జిగ - ల‌స్సీ బండిని సృష్టించారు. అక్క‌డకు వెళ్లి ఎమ్మెల్యే కొంత స‌హాయం చేసి మ‌ళ్లీ ఫొటోలు - వీడియోల‌కు ఫోజులివ్వ‌డం య‌థావిధిగా సాగుతాయి. ఆ త‌ర్వాత వెంట‌నే అవి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.

ఈ విధంగా ఆమె ప‌బ్లిసిటీ స్టిల్స్ పీక్స్‌ కు చేరాయి. ఏకంగా వాటిని సృష్టించి ఫొటోలకు పోజులివ్వ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. సినిమాల్లో చూసిన మాదిరి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రోజుకో సెట్ త‌యార‌వుతోంది. అక్క‌డ‌కు ఆ ఎమ్మెల్యే వెళ్లి ప‌బ్లిసిటీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునే స‌మ‌యంలో హెచ్‌ డీ ఫొటోలు - వీడియోలు ఎలా సాధ్య‌మ‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఆమె ఇదంతా మంత్రి ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గంలో ఇద్ద‌రు రాజీనామా చేసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో అందులో ఒక ప‌ద‌వి కోసం ఈమె ప్ర‌య‌త్నాలు చేస్తూ పార్టీ అధినేత‌ - ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టిలో ప‌డేందుకు ఇదంతా చేస్తున్నార‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం సాగుతోంది. సోష‌ల్ మీడియాలో పెయిడ్ ప్ర‌చారం చేసుకుని రాష్ట్రంలో తానే నంబ‌ర్ వ‌న్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకోవ‌డానికి పాకులాడుతున్నార‌ని ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు. ఆమె తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం ప‌క‌డ్బందీగా సీఎం జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటుంటే ఆ ఎమ్మెల్యే మాత్రం భిన్నంగా.. విచిత్రంగా చేస్తుండడంతో రాష్ట్ర ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ్యక్త‌మ‌వుతుంద‌ని వైఎస్సార్సీపీ నాయ‌కులు - కార్య‌క‌ర్త‌లు పేర్కొంటున్నారు. ఆమె ప‌బ్లిసిటీ స్టంట్స్ పీక్‌ కు చేరాయ‌ని.. ఈ విధంగా ఎమ్మెల్యే జిమ్మిక్కులు ఉంటే ప్ర‌జ‌లు ఆద‌రించ‌ర‌ని చెబుతున్నారు. నిజ‌మైన బాధితుల‌కు స‌హాయం చేస్తే ఎలాంటి ప్ర‌చారం చేసుకో్కుండానే అధిష్టానంతో పాటు ప్ర‌జ‌లు గుర్తిస్తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉంటే ప‌ద‌వులు వాటంత‌ట అవే వ‌స్తాయ‌ని పేర్కొంటున్నారు. మ‌రి ఇక‌నైనా ఆ ఎమ్మెల్యే మారుతుందో లేదో వేచి చూడాలి.