Begin typing your search above and press return to search.
ముస్లిం టోపీతో సీఐ..రాజాసింగ్ ఫైర్
By: Tupaki Desk | 6 Jun 2019 10:11 AM GMTరాజా సింగ్.. కరుడుగట్టిన హిందుత్వవాది.. హిందువులను ఏదైనా అంటే ఊరుకునే రకం కాదు.. ఆ హిందుత్వవాదమే ఆయనను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి బీజేపీ ఉద్ధండులే ఓడిపోయిన వేళ.. రాజాసింగ్ గోషా మహల్ లో గెలిచాడంటే అది ఆయన ముస్లిం వ్యతిరేక చేష్టలేనని నియోజకవర్గంలో టాక్ ఉంది.
అలాంటి కరుడుగట్టిన హిందుత్వ ఎమ్మెల్యేకు తాజాగా ఓ పోలీస్ చేసిన తప్పు దొరికింది. ఇంకేముంది దాన్ని రచ్చ చేశాడు. డీజీపీకి, హైదరాబాద్ సీపీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తాజాగా రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లోని ఫలక్ నుమా సీఐ శ్రీనివాసరావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ లో యూనిఫాంలో ఉండగా.. పోలీస్ టోపీ తీసేసి ముస్లింల టోపీని తలపై ధరించి ఈ విషెస్ చెప్పడం వివాదాస్పదమైంది.
పోలీస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ రూల్స్ 1954 ప్రకారం డ్రెస్ కోడ్ ని ఉల్లంఘించరాదు.. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన సీఐపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. సీఐ తీరుపై డీజీపీ, కమిషనర్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశాడు. ముస్లిం టోపీ ధరించి ఎలా శుభాకాంక్షలు చెపుతాడని ప్రశ్నించారు. ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు.
ఇక పోలీసుల తీరును రాజాసింగ్ ఎండగట్టారు.నవరాత్రి, దీపావళి, గణేష్ చతుర్తి సందర్భంగా ఉరేగిస్తూ హిందూ యువకులను కొట్టే పోలీసులు రంజాన్ సందర్బంగా ఎందుకు లాఠీలు ఝళిపించడం లేదని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు స్పందించాలని స్పష్టం చేశారు.