Begin typing your search above and press return to search.
ఐఎస్ఐ అడ్డాగా హైదరాబాద్ ... ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 29 Jun 2021 11:30 AM GMTతెలంగాణ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఐ ఎస్ ఐ అడ్డాగా మారింది అని అన్నారు. మనదేశంలో ఏ మూల ఏ పేలుళ్లు జరిగినా హైదరాబాద్ లోనే మూలాలు బయటపడుతున్నాయని అన్నారు. తెలంగాణాలో అధికారంలోకి టిఆర్ ఎస్ వచ్చాక బ్లాస్ట్ లు తగ్గాయన్నారు. ఎంఐఎం టిఆర్ ఎస్ ఒక్కటైన తర్వాత ఓల్డ్ సిటీ బాంబ్ ఫ్యాక్టరీ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు.
సికింద్రాబాద్ నుంచి బీహార్ వెళ్లిన పార్సిల్ బ్లాస్ట్ ఘటనపై విచారణ జరిపారు పోలీసులు. అసిఫ్ నగర్ కి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకరు పాకిస్థాన్ లో శిక్షణ పొంది వచ్చినట్లు తేలింది. ఈ ఘటనపై మాట్లాడుతూ రాజా సింగ్.. తెలంగాణ ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పాకిస్థాన్ ఎంత మంది వెళ్తున్నారన్నారు. ఇలాంటి వారు ఎంత మంది హైదరాబాద్ లో ఉన్నారు, అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిపై పోలీసులు ఎందుకు నిఘా పెట్టడం లేదని అయన ప్రశ్నించారు. హోం మంత్రి, పోలీసులు ఎం చేస్తున్నారు , హైదరాబాద్ లో బాంబులు తయారు చేసే పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో పోలీసులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అరెస్ట్ అయిన వారి వివరాలు ఎందుకు దాస్తున్నారన్నారు. అరెస్ట్ అయిన వారి వెనకాల ఎవరు ఉన్నారు, ఏ సంస్థకు చెందిన వారో వెలికితీయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.