Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే ఆర్కే కు మస్తు కోపం వచ్చింది.. ఎందుకంటే?
By: Tupaki Desk | 3 Jan 2020 4:43 AM GMTపాలనపై తన ముద్ర వేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన అంతా ఇంతా కాదు. ఆయన కోరుకున్న స్థాయిలో పనులు జరగని తీరుపై ఆయన ఇటీవల కాలంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఏసీబీ అధికారుల పని తీరు మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. రానున్న మూడు నెలల్లో సెలవులు తీసుకోకుండా పని చేయాలని టార్గెట్ పెట్టారు ముఖ్యమంత్రి. అంతేకాదు.. నెలలో తాను రివ్యూ చేస్తానని.. పని తీరులో ఎంత మార్పు వచ్చిందో చూస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. ఏపీ విద్యా శాఖాధికారులు నిద్ర పోతున్నారంటూ ఆయన ఫైర్ కావటం విశేషం. ఆర్కేకు ఎందుకంత కోపం వచ్చిందన్న కారణంలోకి వెళితే.. అవాక్కు కావటమే కాదు.. ఇదే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే అధికారుల తీరు మీద మరెంత ఫైర్ కావటం ఖాయం. ఎందుకంటే 2019 జూన్ లో ఇవ్వాల్సిన పుస్తకాలు 2020 జనవరిలో కూడా పంపిణీ చేయలేదన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో నేటికీ ప్రభుత్వ స్కూళ్లకు పుస్తకాల పంపిణీ జరగలేదన్నారు. మరో రెండు..మూడు నెలల్లో వార్షిక పరీక్షలు వచ్చేస్తున్న వేళ.. ఇప్పటివరకూ టెస్ట్ పుస్తకాలు ఇవ్వకపోవటాన్ని ఏమనాలి? దీనికి తగ్గట్లే ఆర్కే వ్యాఖ్యలు ఉన్నాయి. ఏం చదివి పిల్లలు పరీక్షలు రాయాలని అధికారుల్ని నిలదీశారు. ఏపీ ముఖ్యమంత్రి.. రాష్ట్ర విద్యా శాఖామంత్రి మంచి ఆశయంతో పని చేస్తున్నా..అధికారుల తీరు మాత్రం సరిగా లేదని మండిపడ్డారు. పాలనా పరమైన పొరపాట్ల విషయంలో కఠినంగా ఉంటున్న జగన్.. గత ఏడాది మేలో ఇవ్వాల్సిన పుస్తకాలు జనవరి నాటికి ఇవ్వక పోవటం తెలిస్తే.. అగ్గి మీద గుగ్గిలం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయినా.. అధికారులు అంత నిర్లక్ష్యం గా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు?