Begin typing your search above and press return to search.
ఆర్కే ఓపెన్ సవాల్..స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తా
By: Tupaki Desk | 3 Jan 2020 6:47 AM GMTవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి లోని కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ... సంచలన ప్రకటన చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు లక్షల కోట్లల్లో అవినీతి చేశారని ఆరోపించారు. తనపై బోండా ఉమా చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన క్లారిటీ ఇచ్చారు. `నా ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచి ఉన్నాయి. నా భార్యకు నీరుకొండ గ్రామం లో ఐదు ఎకరాలు భూమి ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. భూమి ఉందని కనిపెట్టిన వారికి ఆ ఐదు ఎకరాలు రాసి ఇచ్చేస్తా.. లేదంటే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తా..-శాశ్వతంగా రాజకీయాలు కు దూరంగా ఉంటాను.`` అని సంచలన ప్రకటన చేశారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రిక ల్లో తనకు భూముల ఉన్నాయని అవాస్తవాలు రాశారని ఆర్కే పేర్కొన్నారు. ``కనీసం నా వివరణ అడగకుండా రామోజీరావు, రాధాకృష్ణ ఎలా రాస్తారు? చంద్రబాబు కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయం పడుతున్నారు. లక్షల కోట్ల అవినీతి బైట పడుతుందని కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. నీచ రాజకీయాలతో చంద్రబాబు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. రాజధానికి చంద్రబాబు పెద్ద శాపం.. రాజధానికి వైయస్ జగన్ వరం. ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో భయపెట్టి రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కోలేదా? ఐదేళ్లుగా రాజధాని రైతుల్ని దోచుకోవడం తప్ప.. రైతులకు చేసిందేమీ లేదు.. మోసం చేసాడు కనుకే.. మంగళగిరి, తాడికొండలో టీడీపీని ఓడించారు` అని ఆర్కే ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు పాక్షికం గా కూడా అమలు చేయలేదని ఆర్కే మండిపడ్డారు. ``ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కొన్న భూముల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నాడు. బినామీ భూముల విలువ పడి పోతుందని చంద్రబాబు తెగ బాధ పడిపోతున్నాడు. 13 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముందంజలోనే ఉన్నాయి.. ఇక్కడవారు విదేశాలకు వలసలు వెళ్లి స్దిరపడుతున్నారు. ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలు అభివృద్ధి చెందాలి. బ్రతకలేక వలసలు వెళ్తున్న సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబు కి అవసరం లేదా..?` అని ప్రశ్నించారు.
ఐదేళ్లు రాజధానిలో అవినీతి జరిగితే పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని ఆర్కే నిలదీశారు. ``రాజధాని విషయంలో ప్యాకేజి తీసుకుని పవన్ కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు. ప్యాకేజీ కోసమే పవన్ మంగళగిరి లో జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టలేదు..వామపక్షాలకు ఇచ్చినా కనీసం ప్రచారం కూడా చెయ్యలేదు. రాజధాని రైతుల్ని ప్రత్యక్షంగా చంద్రబాబు మోసం చేస్తే.. ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ పరోక్షంగా మోసం చేశాడు. భూములు ఇవ్వని రైతుల్ని చంద్రబాబు కొట్టించిన రోజున భువనేశ్వరి ఏమయ్యారు..?మూడు పంటలు పండే భూములు లాక్కున్నప్పుడు రైతులు గుర్తు రాలేదా..? రాజధానిలో సొంత ఇల్లు కట్టుకోకుండా అక్రమ కట్టడంలో ఉండటానికి చంద్రబాబు, లోకేష్ కి సిగ్గు లేదా..? ఐదేళ్లుగా రాష్ట్రంలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు.. చెప్పండి`` అని నిలదీశారు.