Begin typing your search above and press return to search.

జగన్..బాబులకు దక్కని అవకాశం ఫైర్ బ్రాండ్ కు దక్కింది

By:  Tupaki Desk   |   9 Aug 2019 8:07 AM GMT
జగన్..బాబులకు దక్కని అవకాశం ఫైర్ బ్రాండ్ కు దక్కింది
X
పండించే ప్రతి గింజ మీద పేరు రాసి ఉంటుందని.. ఎంత ప్రయత్నించినా.. ఎవరి పేరు రాసి ఉంటుందో వారికే అది సొంతమవుతుందన్న మాటను చెబుతారు. తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన కియా కార్ల లాంఛింగ్ ప్రోగ్రాంను చూస్తే.. ఈ భావన కలుగక మానదు. వైఎస్ ఆలోచనలతో మొదలైన కియా కల.. చంద్రబాబు చొరవతో.. మోడీ అండతో ఏపీలోని అనంతపురంలో ఫ్లాంట్ పెట్టటం.. కార్లను తయారు చేయటం.. అది కాస్తా మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు లాంఛ్ చేయటం తెలిసిందే. అయితే.. ఇలాంటి కీలకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చే ఛాన్స్ లేదు.తప్పనిసరిగా హాజరవుతారని భావించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వేరే కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోయారు. ఇలాంటి వేళ.. ఈ కీలకమైన కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండాల్సి రావటంతో ఏపీఐఐసీ ఛైర్మన్ హోదాలో ఉన్న రోజా.. కియా కొత్త కారు సెల్టోస్ ను లాంఛ్ చేసే లక్కీ ఛాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్.. శంకర్ నారాయణ తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సందేశాన్ని బుగ్గన చదివి వినిపించారు. రూ.13,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన దక్షిణ కొరియా కంపెనీ ఈ ప్లాంట్ ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

తన హయాంలో ఈ ప్లాంట్ నుండి కారును లాంఛ్ చేయాలని చంద్రబాబు అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోవటంతో కియా కారును తానే లాంఛ్ చేయాలన్న స్వప్నాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. వాస్తవానికి చంద్రబాబు కారణంగానే కియా కారు వచ్చిందన్న ప్రచారం జరిగినా.. అదేమీ నిజం కాదని.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీకి కార్ల పరిశ్రమను తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన డాక్యుమెంట్ తాజాగా బయటకు వచ్చింది. తన తండ్రి కలను తీర్చే అవకాశం జగన్ కు వచ్చినా.. అనూహ్యంగా పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ తో పాటు కీలకమైన కార్యక్రమాలకు హాజరవ్వాల్సి రావటంతో ఆయన కియా కార్ల ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారు. అదే సమయంలో అవకాశాన్ని దక్కించుకున్న ఆర్కే రోజా మేకిన్ ఏపీ తొలి కారును మార్కెట్లోకి విడుదల చేశారు. రాసి పెట్టి ఉంటే ఇలానే ఉంటుంది మరి.