Begin typing your search above and press return to search.
పవన్ పై రోజా సెటైరికల్ పంచ్ లు...:
By: Tupaki Desk | 27 Feb 2022 6:38 AM GMTపవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదలతో థియేటర్లలో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టిక్కెట్ల విషయంపై నెలకొన్న వివాదం కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చాలా చోట్ల సినిమాలు నడవలేదు.
దీంతో భీమ్లానాయక్ పై ప్రభుత్వం కక్షసాధింపు చేస్తందని జనసేన నేతలు మండిపడ్డారు. కావాలనే టిక్కెట్ల రేట్లు తగ్గింపు చేసి రాద్దాంతం సృష్టించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో పాటు సినీ నిర్మాత నాగబాబు ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సినీ నటి, వైసీపీ మహిళా నేత రోజా స్పందించారు. జనసేన నేతలకు కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రోజా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'భీమ్లానాయక్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారన్నారు. ఈ సినిమాకు రూ.150కి విక్రయించారన్నారు. ఇలా అమ్మడం వల్ల సినిమాకు వచ్చిన నష్టమేంటని అన్నారు. పవన్ కల్యాన్ ఏమైనా నిర్మాతనా..? అని ప్రశ్నించారు.
ఆయన నటించినందుకు పారితోషికం తీసుకుంటున్నారుగా..? అని అన్నారు. బాలకృష్ణ సినిమా అఖండ, అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమాలకు ఎలాంటి టిక్కెట్ల రేట్లు నిర్ణయించారో భీమ్లానాయక్ కూడా అంతే విధించారన్నారు. ఇందులో ప్రత్యేకంగా భీమ్లానాయక్ పై కక్షసాధింపేమీ లేదన్నారు.
అయితే సినిమా టిక్కెట్ల వివాదం పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైందన్నారు. ఇప్పటికే సమావేశం కావాల్సి ఉండగా మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదాపడిందన్నారు. ఈనెల 21న ప్రభుత్వం సినీ పెద్దలతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. కానీ ఇంతలో కొందరు ప్రభుత్వంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు.
ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ పై రోజా వేసిన పంచ్ లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ రోజాపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమా ప్రభంజనం సృష్టిస్తోందని, అది చూసి ఓర్వేలేకే వైసీపీ నాయకులు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారన్నారు.
అయితే కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అయతే రోజా కౌంటర్ పై పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.