Begin typing your search above and press return to search.
పవన్ మీద సంచలన ఆరోపణ చేసిన ఎమ్మెల్యే ఆళ్ల
By: Tupaki Desk | 3 Jan 2020 6:27 AM GMTహాట్ హాట్ గా మారిన ఏపీ రాజకీయం మరింత వేడెక్కేలా విపక్ష నేతలపై అధికారపక్ష నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు. తన మాటలతో.. చేతలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపరీతం గా ప్రయత్నిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయనెంత కష్ట పడుతున్నా.. ఫలితం మాత్రం రాని పరిస్థితి. ప్రజల్ని ఆకట్టుకునేలా.. వారి మనసుల్లో ముద్ర పడేలా చేయటంలో పవన్ ఫెయిల్ అవుతున్నారన్న మాట ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన మీద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణను సంధించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద జనసేనాధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారన్నారు. బాబుకు కొత్త బినామీగా పవన్ మారారన్న ఆయన.. అర్థరాత్రి వేళ కరకట్ట వద్దకు వెళ్లి ప్యాకేజీలు తీసుకున్నట్లు ఆరోపణలు చేశారు. తాను ఉత్తనే మాటలు చెప్పటం లేదని.. తాను చేస్తున్న ఆరోపణల వెనుక లాజిక్ చూపించి మరీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఆళ్ల.
బాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్న కారణం గానే గత ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో జనసేన తన అభ్యర్థిని బరిలోకి దించలేదన్నారు. ఇదొక్కటి చాలు పవన్ ప్యాకేజీ తీసుకున్నారనటానికి నిదర్శనమన్నారు. బాబు దగ్గర ప్యాకేజీ తీసుకోకుంటే.. మంగళగిరిలో జనసేన పార్టీ తన అభ్యర్థిని ఎందుకు బరిలోకి దించలేదో చెప్పాలన్నారు. ఆళ్ల వారుతాజాగా సంధించిన ప్రశ్నకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.