Begin typing your search above and press return to search.

ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   4 April 2021 2:00 PM IST
ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
X
వైసీపీ ఎమ్మెల్యే రోజా అస్వస్థతకు గురై ఇటీవలే చెన్నైలోని అడయార్ మలర్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు ఆపరేషన్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రోజా కోలుకోవడంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు రోజాకు విశ్రాంతిని ఇచ్చారు డాక్టర్లు.

డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె, కుమారుడు, కుటుంబ సభ్యులతో రోజా ఫొటోలు దిగి తాను బాగానే ఉన్నానని అభిమానులకు తెలిపారు.వారం రోజులుగా రోజా ఆస్పత్రిలో ఉన్నారు. ఆమె కోలుకున్నారని రోజా భర్త తెలిపారు. గత ఏడాదియే రోజాకు ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు.

అయితే ఇటీవల పరీక్షలు చేసుకోగా.. వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో తిరుపతి ఎన్నికల తర్వాత చేసుకుంటానన్నారు. కానీ వైద్యులు వారించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకున్నారు.ఇక ఆపరేషన్ చేయించుకున్న రోజాకు సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని.. ఎన్నికల సంగతి వదిలేయాలని .. విశ్రాంతి తీసుకోవాలని రోజాకు జగన్ సూచించారు.