Begin typing your search above and press return to search.
పరిశుద్ధ కార్మికులకు బియ్యాన్ని ఉచితంగా పంచిన ఎమ్మెల్యే రోజా!
By: Tupaki Desk | 28 March 2020 11:50 AM GMTదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 900 దాటింది. అలాగే దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 20 కి చేరింది. దీనితో కరోనాని అరికట్టడానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీని వల్ల జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కాకపోతే మరికొంతమంది లాక్ డౌన్ ఉన్నప్పటికీ ..పనిలేకపోయినా కూడా ఇంట్లో నుండి బయటకి వస్తున్నారు.
కాగా , కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డాక్టర్లు - వైద్య సిబ్బంది - పోలీసులు - ప్రభుత్వ అధికారులు - మున్సిపాలిటీ సిబ్బంది .. వారి ప్రాణాలకి తెగించి మరీ ప్రజల కోసం కష్టపడుతున్నారు. అలాగే మరోవైపు ప్రభుత్వం కూడా కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది - దీనితో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ కరోనాపై పోరుకి తమ వంతు సాయంగా కొంతమంది సినీ - రాజకీయ ప్రముఖులు ఇతర ప్రముఖులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఇందులో భాగంగానే ..సినీ నటి - వైసీపీ నగరి ఎమ్మెల్యే - ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తనవంతు సాయంగా ..గత మూడు రోజుల నుండి రోజా చారిటబుల్ ట్రస్ట్ నుండి ..శానిటేషన్ చేసేవారికి - పోలీసులకి - హాస్పిటల్ సిబ్బందికి ఫ్రీ మీల్స్ పెడుతున్నారు. అలాగే నియోజకవర్గం లోని పేద పారిశుధ్య కార్మికులకి - ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని అందజేశారు. పరిశుద్ధ కార్మికులు కరోనా ఇంతగా ప్రభావం చూపుతున్నప్పటికీ కూడా ..రోజు ఉదయాన్నే విధుల్లో చేరి , రోడ్డు వెంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ - పరిసర ప్రాంతాలని క్లీన్ చేస్తూ ..కరోనా సోకకుండా చూస్తున్నారని అలాంటివారికి ఈ మాత్రం సహాయం చేయడం పెద్ద విషయం కాదు అని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే ఈ లాక్ డౌన్ వల్ల రోడ్డు మీద ఉండే చాలామంది యాచకులు ఆకలితో అలమటిస్తున్నారని ..అలాంటివారికి ఎవరికీ తోచిన విదంగా వారు వారి కడుపునింపే ప్రయత్నం చేయండి అని కోరారు. మొత్తంగా ఎమ్మెల్యే రోజాని ఆదర్శంగా తీసుకోని మరింత మంది ప్రజాప్రతినిధులు ఈ విదంగా ముందుకు వచ్చి - తమ తమ నియోజకవర్గంలో ఆకలితో పస్తులు పడుకునే వారి పొట్ట నింపే ప్రయత్నం చేస్తారని కోరుకుందాం ...