Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు బావిలో దూకాలి:రోజా

By:  Tupaki Desk   |   5 May 2018 1:32 PM GMT
చంద్ర‌బాబు బావిలో దూకాలి:రోజా
X
ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ...దాచేప‌ల్లిలో తొమ్మిదేళ్ల మైన‌ర్ బాలిక అత్యాచార ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘాతుకానికి పాల్ప‌డ్డ సుబ్బ‌య్య ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఆ ఉదంతం ముగిసిపోయింది. అయితే, నిందితుడు సుబ్బ‌య్య వైసీపీకి చెందినవాడేన‌ని, ఆ ఘ‌ట‌న‌న‌ను వైసీపీ నేత‌లు రాజ‌కీయం చేస్తున్నార‌ని....టీడీపీ నేతలు ప్ర‌చారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దాచేపల్లి ఘ‌ట‌న‌లో బాధితులకు వైసీపీ అండగా నిలిచిందని, అందుకే త‌మ‌పై టీడీపీ బుర‌ద‌జ‌ల్లుతోంద‌ని మండిప‌డ్డారు. సుబ్బయ్య టీడీపీ సభ్యుడ‌ని రోజా స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. టీడీపీ హ‌యాంలో ఇటువంటి ఘోరాలు జ‌రుగుతున్నందుకు చంద్ర‌బాబు బావిలో దూకాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌థువా ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ...ప్ర‌ధానిని రాజీనామా చేయ‌మ‌న్న చంద్ర‌బాబు....దాచేప‌ల్లి ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డానికి అర్హుడు కాద‌ని రోజా అన్నారు.

టీడీపీ హ‌యాంలో మ‌హిళ‌లు ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందని రోజా అన్నారు. గురువారంనాడు రాష్ట్రంలో 11 అత్యాచార కేసులు నమోదయ్యాయని, ఆ బాధితులను ఎందుకు పరామర్శించరని రోజా నిలదీశారు. తాము గ‌ట్టిగా నిల‌దీయ‌డంతోనే సీఎం బాధితురాలిని పరామర్శించడానికి వచ్చారని రోజా అన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసినా చ‌ర్యలు తీసుకోలేదన్నారు. కాల్ మ‌నీ కేసులో బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ లు ఉన్నారని, అందుకే ఆ కేసు విచారణ ముందుకు సాగ‌లేద‌ని అన్నారు. కాల్ మనీపై త‌న గ‌ళం వినిపించినందుకే త‌న‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని రోజా అన్నారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి 10కి.మీ దూరంలో ఉన్న నిందితుడిని పట్టుకోవ‌డంలో దద్దమ్మ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని రోజా అన్నారు. టీడీపీ నాయకులకు కాప‌లాగా పోలీసు వ్య‌వ‌స్థ ఉంటోంద‌ని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూస్తామ‌న్నారు.