Begin typing your search above and press return to search.
ప్రొటోకాల్ రగడ: ఉప ముఖ్యమంత్రిపై రోజా ఆగ్రహం
By: Tupaki Desk | 26 May 2020 8:50 AM GMTనియోజకవర్గానికి ఎమ్మెల్యేనే నాయకుడు. ఆ నియోజకవర్గంలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమం జరగాలన్నా ఎమ్మెల్యే చేతులపైనే జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అన్ని వ్యవహరిస్తాడు. అయితే ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో ఏ ప్రతినిధి పర్యటించినా రాద్ధాంతం రేగుతుంది. ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా పర్యటన జరపడంపై వివాదం మొదలైంది. అదే ప్రొటోకాల్ పాటించకపోవడం.. ఈ ప్రొటోకాల్ వివాదం పుత్తూరులో జరిగింది.
పుత్తూరు నగరి నియోజవర్గంలో ఉన్న ప్రాంతం. ఈ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. నగరి ఎమ్మెల్యేగా తనకు సమాచారం ఇవ్వకుండా పర్యటించడంపై ఏపీఐసీసీ చైర్ పర్సన్ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తాను నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నా కూడా తనను పట్టించుకోకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపించారు.
పుత్తూరులోని అంబేడ్కర్ సంఘం తరపున దళితులకు కల్యాణ మండప స్థల సేకరణ కోసం ఆకస్మికంగా స్థల పరిశీలన చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు. దీనికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పర్యటించారు.