Begin typing your search above and press return to search.
ఆ రోజుల్ని గుర్తు చేసి మరీ ఫైర్ బ్రాండ్ ఫైర్!
By: Tupaki Desk | 16 July 2019 10:56 AM GMTచేసిన పాపం ఊరికే పోదంటారు? అందుకే చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆచితూచి అన్నట్లు నిర్ణయాలు తీసుకోవాలే తప్పించి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. తప్పును సరిదిద్దాల్సింది పోయి దాన్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే ఫలితం ఎలా ఉంటుందో బాబు ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నారు. చింతమనేనిని కంట్రోల్ చేయటంలో విఫలమైన చంద్రబాబు.. ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. ఎమ్మార్వో వనజాక్షి ఎపిసోడ్ అధికారపక్షానికి ఆయుధంగా మారితే.. బాబు బ్యాచ్ కు ఇప్పుడు శాపంగా మారింది.
గడిచిన కొద్ది రోజులుగా మౌనంగా ఉంటూ.. బయట పెద్దగా కనిపించని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా గళం విప్పారు. అసలే ఫైర్ బ్రాండ్. చాలా రోజులుగా మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఆమె ఈ రోజు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సహజంగానే మాటకారి అయిన రోజాకు బాబుపై విమర్శలు చేసే విషయంలో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఆమె మాటల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి.
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు సభా సంప్రదాయాల గురించి మాట్లాడటాన్ని రోజా తీవ్రంగా తప్పు పట్టారు. అసెంబ్లీలో నియమాల గురించి బాబు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్న విషయాన్ని చెప్పిన ఆమె.. గతంలో డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ చేత కన్నీళ్లు పెట్టించింది మీరా కాదా? అని క్వశ్చన్ చేశారు.
పార్టీ పెట్టి గెలిపించిన ఎన్టీఆర్ కే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబు ఈ రోజు సంప్రదాయాల గురించి మాట్లాడటమా? అని ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల అంతు చూస్తామని బాబు బెదిరించారని.. ఇప్పుడేమో ఇలా నీతులు మాట్లాడటం ఏమిటన్న ఆమె.. అచ్చెన్నాయుడు ఈ రోజు గింజుకుంటున్నారన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు నాటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడినప్పుడు సభా సంప్రదాయాలు గుర్తుకు రాలేదా? అంటూ నాటి సంగతుల్ని గుర్తు చేశారు.దేశంలో మరే అసెంబ్లీలోనూ లేని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారని.. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చ జరగకుండా రాద్దాంతం చేయకుండా ఉండాలన్నట్లుగా విపక్షాల తీరు ఉందన్నారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేస్తే టీడీపీ నేతలకు సంబంధం ఉందన్న ఒకే ఒక్క కారణంతో కేసులే లేకుండా చేసింది మీరు కాదా? అని నిలదీసిన రోజా.. శాంతిభద్రతల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. మళ్లీ వాళ్లే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వటం సరిగా లేదన్నారు. మొత్తంగా చూస్తే బాబు ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పుల్లో ముఖ్యమైన వాటన్నింటిని మర్చిపోకుండా ప్రస్తావించిన రోజా.. తనకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్లే నిప్పులు చెరిగారని చెప్పక తప్పదు.