Begin typing your search above and press return to search.
నగరి నలిగిపోతోందిగా...జగన్ పుట్టిన రోజున కూడా... ?
By: Tupaki Desk | 20 Dec 2021 11:51 AM GMTచిత్తూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది. 2014 ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లను ఇక్కడ ఆ పార్టీ గెలుచుకుంది. ఇక అందులో నుంచి కొంతమంది నాడు అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ చేశారు. అయితే 2019లో మొత్తం లెక్కలు తారు మారు అయ్యాయి. కేవలం చంద్రబాబు కుప్పం నుంచి తప్ప టీడీపీకి చెందిన కీలకమైన నేతలు అందరూ ఓడిపోయారు. ఇదిలా ఉంటే ఏకపక్షంగా నాటి నుంచి విజయం సాధిస్తూ వస్తున్నా కూడా చిత్తూరు జిల్లాలో వైసీపీ గ్రూపు రాజకీయాలకు కొదవ లేదు.
అన్నింటికి మించి సినీ నటి, మహిళా ఎమ్మెల్యే అర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వర్గ పోరు తారస్థాయిలో సాగుతోంది. రోజాకు యాంటీగా బలమైన వర్గమే ఢీ కొడుతోంది. ఆ వర్గానికి జిల్లాలో పెద్ద దిక్కు, వైసీపీలో పెద్ద తలకాయ లాంటి వారి మద్దతు ఉందని అంటారు. రోజా అయితే నగరి లో ఇల్లు కట్టుకున్నా కూడా ఆమె ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారని చెబుతారు.
ఇక తన మనుషులను అక్కడ పెట్టుకుని ఆమె ఎమ్మెల్యేగా పాలన సాగిస్తూ వస్తున్నారు. సరిగ్గా ఈ పాయింటే సొంత పార్టీలోని ప్రత్యర్ధులకు బలంగా మారుతోంది. పక్కా లోకల్ మేమే అంటూ వైసీపీలోని బీసీ నేతలు, స్ట్రాంగ్ లీడర్స్ నగరిలో పట్టు సాధించేందుకు చూస్తున్నారు. వారంతా ఎమ్మెల్యేకు యాంటీ ఒక ముద్ర పడిపోయింది. ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రత్యర్ధి పార్టీ కంటే కూడా సొంత పార్టీ నేతలతోనే రోజా అతి పెద్ద యుద్ధం చేశారు.
మొత్తానికి తాను అనుకున్న వారిని లోకల్ బాడీస్ పదవుల్లో కూర్చోబెట్టడానికి ఆమె ఏకంగా జగన్ దాకా పంచాయతీని తీసుకువెళ్లాల్సివచ్చింది. అయినా సరే వర్గ పోరు అసలు సర్దుకోవడంలేదు. తాజాగా జగన్ పుట్టిన రోజు వేళ కూడా రోజా అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నగరిలో ఫ్లెక్సీల యుద్ధమే జరిగింది. ఎమ్మెల్యే రోజాకు యాంటీగా ఉన్న వర్గం వారు కట్టిన ఫ్లెక్సీలను చింపేశారు అంటోంది వ్యతిరేకవర్గం. వారు ఏకంగా డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగడంతో వైసీపీలో గ్రూప్ పోరు మరో మారు బయటపడిపోయింది.
ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేయడం అంటే నిజంగా పార్టీకి అది చెడ్డపేరుగానే ఉంది అంటున్నారు. మొత్తానికి నగరిలో పార్టీ సీన్ ఎలా ఉంది అంటే రెండుగా విడిపోయి బాగా నలిగిపోతోంది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కుతుందా అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది. ఆమె ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే లోకల్ గా ఉండరు అన్న పేరు అయితే వచ్చేసింది. ఆ మీదట ఆమె వ్యతిరేకవర్గం అయితే రోజాకు అసలు సహకరించే సీన్ లేదని అంటున్నారు. దాంతో ఈసారి ఆమె టికెట్ కే ఎసరు వచ్చేలా ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చకపోతే మాత్రం నగరిలో వైసీపీ గెలుపు ఆశలు వదిలేసుకోవాల్సిందే అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి హై కమాండ్ నగరి మీద ఎలా దృష్టి సారిస్తుందో.