Begin typing your search above and press return to search.
ఇక ఏపీకి మూడు రాజధానులు వచ్చాయి: రోజా వ్యాఖ్యలు
By: Tupaki Desk | 12 Feb 2020 9:45 AM GMTమూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిందని ఇప్పుడు అమరావతితో పాటు కర్నూలు - విశాఖపట్టణం రాజధానులని ఏపీఐఐసీ ఛైర్మన్ - ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బిల్లు పాసైపోయిందని స్పష్టం చేశారు. ఎందుకంటే 14 రోజుల్లోపు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందినట్లే వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వాగతించారన్నారు. చిత్తూరులోని తిరుమల లో శ్రీవేంకటశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తాపత్రయం మొత్తం రియల్ ఎస్టేట్‌పై ఉంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని చూస్తుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఆ నిర్ణయానికి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. కేవలం తన రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు సంకుచితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ అమరావతి ఉద్యమంలో భాగంగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేయాలనుకోవడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును ఉత్తరాంధ్ర - రాయలసీమ ప్రజలు తరిమికొడతారని చెప్పారు.
ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో - బయటా పెద్ద ఎత్తున బూతు ప్రచారం జరుగుతున్నదని - ఇతర పార్టీల నేతలే టార్గెట్ గా అబద్ధాలు - అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించారు. లోకేశ్ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదులు చేస్తే కనీసం 80 శాతం మంది తెలుగుదేవం నేతలు జైళ్లలో పడతారని పేర్కొన్నారు. ఘోరమైన తప్పులు చేసినందుకే తండ్రీకొడుకుల్ని జనం చీత్కరించి మూలన పడేశారని - అయినాసరే బుద్ధి తెచ్చుకోకుండా దుష్ప్రచారాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు విషయమై రాజకీయ రచ్చ కొనసాగుతుండగానే.. సీఎం జగన్ కు దగ్గరి వ్యక్తిగా పేరున్న ఎమ్మెల్యే రోజా బిల్లులు ఆమోదం పొందాయంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరీ దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే ఈ బిల్లుపై శాసనమండలి ఛైర్మన్ ఏర్పాటుచేసిన సెలెక్ట్ కమిటీ ఫైల్ వెనక్కు వచ్చింది. ఫైల్‌ను శాసనమండలి కార్యాలయం తిప్పి పంపింది. రూల్ 154 కింద కమిటీ వేయడం చెల్లదని తేల్చారని సమాచారం. తాజా పరిణామాలపై శాసనమండలి కార్యదర్శిని టీడీపీ - బీజేపీ - పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కలిశారు. మండలి ఛైర్మన్ రూల్ 154 కింద కమిటీ వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.