Begin typing your search above and press return to search.
విజయవాడకు వచ్చిన రోజా.. సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 11 Jun 2019 10:27 AM GMTమంత్రి పదవి రాకపోవడంతో అలిగిన రోజాకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిందని.. జగన్ ను కలవడానికి ఈ రోజా హైదరాబాద్ నుంచి వస్తోందని ప్రచారం జరిగింది. అయితే రోజా విజయవాడకు వచ్చేసింది. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.
మంత్రి పదవి ఆశించిన రోజాను బుజ్జగించడానికి జగన్ రమ్మన్నారని మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై తాజాగా రోజా స్పందించారు. నన్నెవరూ విజయవాడ రావాలని ఫోన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
ఇక రోజా విజయవాడ ఎందుకు వచ్చిందనే దానిపైన కూడా ఆమె స్పందించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసమే వచ్చానని ఊహాగానాలకు రోజా చెక్ పెట్టారు.
ఇక తనకు మంత్రి పదవి లేదా ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రోజా క్లారిటీ ఇచ్చారు. నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తా అని ఎవరూ చెప్పలేదు రోజా కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి దక్కలేదని బాధ లేదని ..ఎస్సీ - ఎస్టీ - బీసీల లిస్టులో నేను ఫిట్ అవలేకే స్థానం కోల్పోయానని సామాజిక కోణంలోనే అలా జరిగిందని రోజా క్లారిటీ ఇచ్చారు.
మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా ఎమ్మెల్యేలు ఎందుకు .. అందుకే నేను ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నానని రోజా మొన్నటి విషయంపై మీడియాకు జవాబిచ్చింది. జగన్ గారు రమ్మని పిలిస్తే వెళ్తానని.. నేను అలిగాననేది మీడియా ప్రచారం మాత్రమేనని వివరణ ఇచ్చారు.
కులాల ఈక్వేషన్ కారణంగానే నాకు మంత్రిపదవి దక్కలేదనుకుంటున్నానని రోజా విశ్లేషించారు. నేనెప్పుడూ కులాలని పట్టించుకోలేదని.. నేను ఒక బీసీని పెళ్లి చేసుకున్నానని గుర్తుంచుకోవాలని రోజా తెలిపారు. కానీ ఎస్సీ - ఎస్టీ - బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడానికి నాకు మంత్రి పదవి ఇవ్వలేదంటున్నారని.. మంత్రి పదవులు లభించిన అందరికీ నా శుభాకాంక్షలని రోజా మీడియా ప్రశ్నలకు ముగించారు.