Begin typing your search above and press return to search.
కోవర్టుల గోల పెరిగిపోతోంది ?
By: Tupaki Desk | 1 Jan 2022 3:30 PM GMTపార్టీల్లో కొత్త రకమైన గోల పెరిగిపోతోంది. అదేమిటంటే కోవర్టులు సమస్య. పార్టీలోనే ఉంటు ప్రత్యర్ధి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారిని కోవర్టులంటారు. పార్టీలోనే ఉంటు ఇక్కడి కీలకమైన విషయాలను ప్రత్యర్థి పార్టీ నేతలకు చేరవేయటమే కోవర్టుల ప్రధాన విధి. ఇలాంటి కోవర్టుల సమస్య అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలో పెరిగిపోతున్నట్లే ఉంది. తాజాగా నగిరి ఎంఎల్ఏ రోజా మాట్లాడుతూ తమ పార్టీలో కోవర్టులు పెరిగిపోతున్నారంటు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
నగిరిలో రోజాకు పార్టీలోనే బలమైన ప్రత్యర్థి వర్గం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. రోజా-ప్రత్యర్థి వర్గానికి ఏ విషయంలో కూడి పడటం లేదు. ఒకళ్ళ మీద మరొకళ్ళు పోటీలు పడుతుంటారు. పార్టీ కార్యక్రమాల్లోనే కాదు చివరకు ఫిర్యాదుల్లో కూడా ఒకరిపై మరొకళ్ళు పై చేయి సాధించేందుకు పోటీ పడుతుంటారు. ఇలాంటి నేపధ్యంలోనే వైసీపీలోనే ఉంటు టీడీపీకి అనుకూలంగా కొందరు పనిచేస్తున్నారంటు రోజా మండిపడ్డారు. ఇసుక మాఫియా మీద ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
సరే రోజా విషయాన్ని పక్కనపెట్టేస్తే కొద్దిరోజుల క్రితం చంద్రబాబునాయుడు మాట్లాడుతు పార్టీలో కోవర్టులను ఏరేస్తానంటు చేసిన హెచ్చరికలు సంచలనం సృష్టించాయి. కోవర్టుల వల్లే పార్టీ స్ధానికసంస్ధల ఎన్నికల్లో కొన్నిచోట్ల ఓడిపోయిందన్నారు. కుప్పం మున్సిపాలిటిలో ఓటమి సమీక్షలో చంద్రబాబు కోవర్టుల వ్యాఖ్యలు చేశారు. అప్పటికే ఇలాంటి ఆరోపణలే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితం మీద కూడా వినబడుతున్నాయి. ఇప్పటికి బయటపడింది మూడు నియోజకవర్గాల్లోనే. రోజా ఆరోపణలైనా చంద్రబాబు ఆరోపణలైనా ప్రధానంగా కోవర్టుల గురించే కావటం గమనార్హం.
మరి కోవర్టుల సమస్య షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరింత పెరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. తమ పార్టీల్లో టికెట్ దక్కదని తెలిసినవారు ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీకి చాయిస్ పెరిగిపోయింది. వైసీపీ, టీడీపీల్లో టికెట్లు రాని నేతలు జనసేన, బీజేపీల్లో చేరి టికెట్లు సాధించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎలాగూ ప్రత్యామ్నాయ పార్టీలు ఉన్నాయి కాబట్టి టికెట్ల కోసం ధిక్కారం కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఈ ధిక్కారంతో ధైర్యంతోనే కోవర్టులు పెరిగే ప్రమాదముంది.