Begin typing your search above and press return to search.
పోలీసుల వైఫల్యం వల్లే జగన్ పై దాడి:రోజా
By: Tupaki Desk | 25 Oct 2018 9:10 AM GMTఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కత్తి (కోడి పందెల్లో ఉపయోగించే కత్తి) దాడి ఘటనపై ఏపీ విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి జరిగిన తీరు చూస్తుంటే కచ్ఛితంగా ఏదో కుట్ర దీని వెనుక దాగి ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ దాడి ఆగ్రహంతోనో.. కక్షపూరితంగానో చేయలేదని.. సెల్ఫీ తీసుకుంటూ జగన్ మీద దాడి చేయటం అంటే.. దీని వెనుక పక్కా ప్లాన్ ఉండి ఉంటుందని రోజా వ్యాఖ్యానించారు. తాజాగా జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆమె ఏమన్నారంటే..
+ ఒక వ్యక్తి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకుంటూ వైఎస్ జగన్‌పై దాడి చేయడం చూస్తుంటే ఆవేశంతోనో లేక.. కక్ష్యపూరితంగానో ఈ పని చేయలేదు.
+ ఒక ప్లాన్ ప్రకారం ఎవరో వెనుక ఉండి చేయించారని స్పష్టంగా అర్థమవుతోంది.
+ ఎయిర్‌పోర్టులో ఉండేది స్థానిక పోలీసులు కాదు కాబట్టి తమకు సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉంది.
+ గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ ర్యాలీ చేయాలని బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఇదే విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వే మీదే స్థానిక పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి నిర్భందించడం కళ్లారా చూశాం.
+ వైఎస్ జగన్‌పై దాడి తెలుగు దేశ ప్రభుత్వ వైఫల్యం. ప్రతిపక్షనాయకుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలు ఎలా బతకాలి?
+ ఎయిర్‌పోర్టులో వెయిటర్ కత్తి పట్టుకొని తిరుగుతుంటే గాజులు తొడుక్కొన్నారా? రక్షణ, నిఘా వ్యవస్థ ఫెయిల్ అయ్యాయి.
+ వైఎస్ జగన్‌కి ఏం జరిగినా ఊరుకోబోం. ఇది చంద్రబాబుకు ఇస్తున్న హెచ్చరిక.
+ దాడి చేసిన వ్యక్తి వెనక ఎవరున్నారో విచారణ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
+ లేకుంటే చాలా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. భుజంపైన గాయం అయిన తీరు చూస్తుంటే గోంతు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని అర్థం అవుతోంది.
+ జగన్ త్వరగా స్పందించడం వల్లే తప్పుంచుకోగలిగారు. కత్తిని చూస్తుంటే దానికి ఏమైనా విషం పూసి దాడి చేశారో అర్థం కావట్లేదు. ఆ దిశగా పరీక్షలు జరపాలి.
+ వైఎస్ జగన్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి కత్తికి విషం లాంటిది ఏమైనా పూసారో నిర్ధారించాలి.