చంద్రబాబూ విధి ఎవరినీ విడిచిపెట్టదు: ఎమ్మెల్యే రోజా
By: Tupaki Desk | 19 Nov 2021 1:30 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనను, తన భార్యను అసెంబ్లీలో అవమానించారని.. బూతులు తిట్టారని పేర్కొంటూ మీడియా సమావేశంలో కన్నీరు కార్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇదిప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఏడుపుపై చాలా మంది స్పందిస్తున్నారు.
నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా తనదైన శైలిలో స్పందించారు. సెటైర్లు వేశారు. చంద్రబాబుపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. ‘రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని సిడీలు చూపించింది మర్చిపోయావా చంద్రబాబు?’ అని రోజా విమర్శలు గుప్పించింది. విధి ఎవరినీ విడిచిపెట్టదని స్పష్టం చేసింది.
‘‘72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ను ఎంతగా ఏడిపించారో గుర్తుందా? 72 ఏళ్ల 7 నెలలకే నీకా పరిస్థితి వచ్చింది.. అందుకే అంటారు మనం ఏం చేస్తే మనకి అదే పరిస్థితి వస్తుందని.. నీ భార్యను ఏదో అనేశారని బాధపడుతున్నావని.. ఆనాడు హైదరాబాద్ లో పీతల సుజాత ద్వారా మీడియా పాయింట్ లో నేను బ్లూ ఫిల్మ్ లో నటించానని సీడీలు చూపించావు మరిచిపోయావా?’’ అంటూ రోజా నిప్పులు చెరిగారు.
నాకు ఫ్యామిలీ లేదా? నాకు పిల్లలు లేరా? నాకు గౌరవం లేదా? ఎవరిని ఏదైనా అంటాం.. అధికారంలో ఉంటే ఏదైనా చేయవచ్చా? అని
చంద్రబాబుపై రోజా నిప్పులు చెరిగారు. రోజా అదిరిపోయే కౌంటర్లతో బైబై బాబూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.