Begin typing your search above and press return to search.

గవర్నర్ కు షాకిచ్చిన అసెంబ్లీ

By:  Tupaki Desk   |   19 Feb 2022 7:30 AM GMT
గవర్నర్ కు షాకిచ్చిన అసెంబ్లీ
X
కేరళ రాష్ట్రంలో అనూహ్య సంఘటన జరిగింది. కేరళ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో ప్రారంభమయ్యాయి. సంప్రదాయంగా మొదటిరోజు గవర్నర్ తన ప్రసంగం చేశారు. ప్రసంగం తర్వాత అధికార పార్టీ సభ్యులంతా తమ మద్దతు తెలపటం మామూలుగా జరిగేదే. అయితే గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే కాంగ్రెస్ కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో అధికార ఎల్డీఎఫ్ కూటమికి ఎదురు లేకుండా పోయింది.

అయితే ఎల్డీఎఫ్ కూటమి సభ్యులు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. గవర్నర్ ప్రసంగంపై ఎలాంటి స్పందన తెలపకుండా కూర్చోవటం కేరళ అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారి. అధికార పార్టీ సభ్యులు హర్షం వ్యక్తం చేయటం, ప్రతిపక్షాలు వ్యతిరేకించటం మామూలుగా జరిగేదే. కానీ ఇక్కడ అధికార పార్టీ సభ్యులు కూడా వ్యతిరేకించటమే ఆశ్చర్యంగా ఉంది. పోనీ గవర్నర్ ఏమన్నా స్పీచ్ ను తనిష్టం వచ్చినట్లు తయారు చేసుకున్నారా అంటే అదీ లేదు.

కేరళ ప్రభుత్వం రాసిచ్చిన స్పీచునే చదివినిపించారు. అయినా అధికార పార్టీ ఎంఎల్ఏలు ఎందుకు నిరసన చెప్పారు ? ఎందుకంటే గవర్నర్ కు ప్రభుత్వానికి ఏ మాత్రం పడటం లేదు. గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్ తనిష్టా రాజ్యంగా చేసుకుపోతున్నారు. రాజ్ భవన్లో తనిష్టం వచ్చిన వారిని నియమించుకుంటున్నారు. ఇలాంటి అనేక ఘటనల కారణంగా గవర్నర్-ప్రభుత్వం మధ్య చాలా గ్యాప్ పెరిగిపోతోంది.

ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బంది పెట్టడం అన్నది కేరళలోనే కాదు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, లెఫ్ట్ నెంట్ గవర్నర్ ముసుగులో ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలను బాగా ఇబ్బందులు పెడుతున్నట్లు నరేంద్ర మోడి సర్కార్ పై రోజరోజుకు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేపధ్యంలోనే గవర్నర్ వైఖరికి కేరళ అసెంబ్లీ పెద్ద షాకిచ్చింది. మరి గవర్నర్ తన వైఖరిని మార్చుకుంటారా ? లేకపోతే తనదైన పద్దతిలోనే ముందుకెళతారా అన్నది చూడాలి.