Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను పంచ్ లతో కడిగిపారేశాడు
By: Tupaki Desk | 5 April 2017 4:59 AM GMTగడిచిన కొద్దిరోజులుగా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ అన్న చందంగా మంత్రి కేటీఆర్ విరుచుకుపడుతున్న వైనం తెలిసిందే. తెలంగాణలో తమను దెబ్బ తీసే కాంగ్రెస్ను ఆయన లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఖేల్ ఖతమని.. కాంగ్రెస్ కు ఫ్యూచర్ లేదని.. కాంగ్రెస్ పని అయిపోయిందని.. ఫ్యూచర్ అంతా తమదేనని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సంపత్ కుమార్. కేసీఆర్ ఫ్యామిలీ పైన మాటల దాడికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా తరచూ విరుచుకుపడే సంపత్ కుమార్ తాజాగా కేటీఆర్ ను టార్గెట్ చేశారు.
తోపులమని చెప్పుకునే చాలామంది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కనిపించని ఫైర్ సంపత్ లో కనిపిస్తుంది. కేసీఆర్ ఫ్యామిలీపై ఎవరూ అనటానికి ఇష్టపడని కొన్ని మాటల్ని అలవోకగా అనేయటమే కాదు.. ఆరోపణల్ని సంధిస్తుంటారు. ఏదైతే తెలంగాణ అధికారపక్షం బలమో సరిగ్గా దాన్నే టార్గెట్ చేశారు సంపత్ కుమార్. తమ ప్రభుత్వంలో అవినీతి అన్నది లేదంటూ ముఖ్యమంత్రి మొదలు పలువురు నేతలు చెబుతుంటారు. కానీ.. వాస్తవం ఏమిటన్నది తెలంగాణ ప్రజలందరికి తెలిసిందే.
తమ లాంటి సుద్దపూసలు తెలంగాణలోని మరే పార్టీలో లేరన్నట్లుగా మాటలు చెప్పే మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడిన సంపత్.. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలో నాలుగు లక్షల రూపాయిల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకొని.. ఇప్పుడు రూ.4వేల కోట్లు సంపాదించిన చరిత్ర కేటీఆర్ దన్న ఆయన.. తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల గబ్బును 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనే సబ్బుతో కడుగుతామని ప్రాస పంచ్ విసిరారు.
కాంగ్రెస్ ఖేల్ ఖతమన్న కేటీఆర్ మాటలు అహంకారపూరితమన్న ఆయన.. అధికారం శాశ్వితం అనుకొని కళ్లు నెత్తికెక్కించుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. ఎవరెవరి ఎంతలా బ్లాక్ మొయిల్ చేసి ఎంతేసి డబ్బులు గుంజారన్న దానిపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా? అంటూకొత్త తరహా సవాలును విసిరారు. అదుర్స్ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించి పెద్దమొత్తంలో డబ్బులు అందాకా కామ్ అయ్యారన్న ఆరోపణ చేసిన సంపత్.. టీఆర్ ఎస్ కు.. కేసీఆర్ కు.. కేటీఆర్ కు పదవుల భిక్ష కాంగ్రెస్ పార్టీదే తప్ప మరెవరిదీ కాదన్నారు. ఈస్థాయిలో విరుచుకుపడిన సంపత్ పై మంత్రి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/