Begin typing your search above and press return to search.
ఇంత వ్యతిరేకత ఎక్కడా లేదట.. ఎమ్మెల్యే సీటు కష్టమే
By: Tupaki Desk | 25 July 2022 5:13 AM GMTఆయన అదృష్టమో.. దురదృష్టమో తెలియదు కానీ.. ఏ వీధిలోకి వెళ్లినా.. ప్రజలు తిట్టపోస్తున్నారు. అభివృద్ది గురించే కాదు.. వ్యక్తిగత సమస్యలపైనా ఆయనను నిలదీస్తున్నారు. దీనికి ఆయన సమాధానం చెప్పుకోలేక పోతున్నారు. దీంతో అసలు నియోజకవర్గంలో పర్యటించడమే దండగ! అనే నిర్ణయానికి వచ్చేశారట. ఆయనే అనంతపురం జిల్లా పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్‌నారాయణ. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకర్‌నారాయణ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక.. జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. సరే.. ఆయన పెరఫార్మెన్స్ సరిగాలేదనే కారణంగా పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడు జగన్ చేసిన సూచనల మేరకు ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నారు. గడపగడపకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ఇదే మార్గమని.. జగన్ చెప్పడంతో కాలికి బలపం కట్టుకుని.. వీధి వీధి తిరుగుతున్నారు. కానీ, ఏం ప్రయోజనం.. అన్ని చోట్లా మహిళల నుంచి నిలదీతలు.. తిట్లు భరించాల్సి వస్తోంది. దీంతో విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారని అనుచరులు చెబుతున్నారు. ``వచ్చే ఎన్నికల్లో టికెట్ వద్దులే అప్పా.. ఇలా ఉండనీ. పుట్టి బుద్ధెరిగాక.. ఇన్ని తిట్లు తినలా`` అని అసహనం వ్యక్తం చేస్తున్నారట.
ఇక, పార్టీ పరంగా చూసుకున్నా.. శంకర్‌నారాయణకు వ్యతిరేక వర్గం పెరిగిపోయింది. వారు కావాలనే ప్రజలను రెచ్చగొడుతు న్నారనేది నారాయణ వర్గం ఆరోపణ. మంత్రిగా ఉన్నప్పుడుకూడా నారాయణకు వ్యతిరేకంగా.. ఈ వర్గం పావులు కదిపింది. తమకు చెందాల్సిన పనులను వేరేవారికి ఇస్తున్నారని.. కనీసం..తమను పట్టించుకోవడం లేదని.. అప్పట్లో నాయకులు ఆరోపిం చారు. దీంతో నియోజకవర్గానికి వెళ్లడమే అప్పట్లో ఆయన మానుకున్నారు. ఇక, ఇప్పుడు వెళ్తే.. ప్రజలు తిట్టిపోస్తున్నారు. పనులు జరగడం లేదని.. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం లేదని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా.. నష్టం లేదని.. ఈ మాటలు పడలేనని.. శంకర్ నారాయణ వ్యాఖ్యా నిస్తున్నారట. మరోవైపు.. వ్యతిరేక వర్గం మాత్రం ఆయనను టార్గెట్ చేస్తూనే ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ప్రజల మధ్య తిరుగుతున్నా.. ఒకటి రెండు ఇళ్లకు మించి తిరగడం లేదని.. ఫొటోలతో సహా అధిష్టానానికి ఫిర్యాదులు చేరుతున్నాయని.. అంటున్నారు. ఎలా చూసుకున్నా.. శంకర్‌నారాయణకు టికెట్ ఇచ్చినా.. ఫలితం మాత్రం దక్కేలా లేదని అంటున్నారు. మరోవైపు.. టీడీపీకి పెట్టని కోట వంటి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ పుంజుకోవడం మరో వైపు శంకర నారాయణకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.