Begin typing your search above and press return to search.
ఇలాంటివి సీతక్క మాత్రమే చేయగలుగుతారంతే!
By: Tupaki Desk | 22 Aug 2019 6:44 AM GMTఎమ్మెల్యే అన్నంతనే ఆకాశంలో నుంచి నేల మీదకు వచ్చిన అద్భుతంగా ఫీలయ్యే వారు బోలెడంత మంది ఉంటారు. కానీ.. కొందరు మాత్రం అందుకు భిన్నం. నేల మీద ఉంటూ.. ప్రజలతో కలిసిపోతూ.. వారిలో ఒకరుగా ఉంటారు. ప్రజల తలలో నాలుకలా ఉంటే ఇలాంటి నేతలు తమకు తాము లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తుంటారు. అలాంటి వారిలో ముందుంటారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.
సాదాసీదాగా ఉంటూ.. సింఫుల్ గా ఉండే ఆమె.. పేద ప్రజలతో ఇట్టే కలిసిపోతుంటారు. వారితో మమేకం కావటం.. వారి సమస్యలు తెలుసుకోవటం చేస్తుంటారు. తాజాగా కారులో వెళుతున్న ఎమ్మెల్యే సీతక్కకు.. రోడ్డు పక్కనే కూర్చొని భోజనం చేస్తున్న మహిళా కూలీలు కనిపించారు. మహబూబ్ నగర్ జిల్లా ఎంచగూడెం గ్రామానికి వెళుతుండగా ఈ సీన్ కనిపించింది.
వెంటనే.. తన కారు ఆపించిన ఎమ్మెల్యే సీతక్క.. కారును ఆపి మహిళా కూలీల వద్దకు వెళ్లి.. వారి మధ్యలో కూర్చున్నారు. అక్కా బాగున్నారా? అంటూ అడిగిన ఆమె.. వారి భోజనాల్లో పచ్చడి కనిపించటంతో.. అందరూ పచ్చడే తెచ్చుకున్నారా? అని అడిగారు.
అంతేకాదు.. మీతో నాకూ కాస్త వడ్డించండి అని అడగటంతో మహిళా కూలీలు అవాక్కు అయ్యారు. అంతలోనే తేరుకొని ఆనందంగా ఆమెకు.. తాము తింటున్న ఆహారాన్ని వడ్డించారు. పచ్చడి అన్నం బాగుందంటూ కితాబులిచ్చారు. ఇలా రోడ్డు పక్కన.. మహిళా కూలీలతో కలిసి భోజనం చేయటం లాంటివి సీతక్క లాంటి కొందరికి మాత్రమే సాధ్యమవుతాయని చెప్పక తప్పదు.