Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ లో ముసలం: మంత్రి ఎదుట ఎమ్మెల్యే రచ్చ
By: Tupaki Desk | 27 Feb 2020 3:30 PM GMTతెలంగాణ అధికార పార్టీలో విబేధాలు ఉన్నా అవి బహిర్గతం కావడం లేదు. ఎందుకంటే పెద్దబాస్, చిన్న బాస్ లకు నచ్చవు. ఒక్కసారి అలాంటివి జరిగితే ఎంతటి పెద్ద నాయకుడినైనా వారు చీపురు పుల్ల మాదిరి పక్కన తీసి పడేస్తారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీమంత్రులనే ఆ విధంగా చేశారు. అలాంటి పరిస్థితులు ఉండడంతో ఎంతటి విబేధాలు ఉన్నా పార్టీ నాయకులు కిమ్మనకుండా సర్దుకుపోతున్నారు. అయితే అక్కడక్కడ అవి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో బహిర్గతమయ్యాయి. ఏకంగా అధికారుల సమక్షంలోనే మంత్రి, ఎమ్మెల్యేలు విమర్శలు చేసుకున్నారు. ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా ఆ ఎమ్మెల్యే దుర్భాషలాడడం విస్మయానికి గురి చేసింది.
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై కలెక్టర్ ఇతర జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. సమావేశం ప్రారంభమైన అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుండడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గా ఉన్న తాను రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
తాను ఆర్‌ఈసీలో చదువుకున్నానని.. ఎర్రబస్సు ఎక్కి రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఉన్నా కూడా అధికారుల తీరుపై కస్సుబుస్సులాడారు. మంత్రిపై ఉన్న కోపాన్ని అధికారులపై తీర్చుకున్నారు. సమీక్ష సమావేశాలు కేవలం ఫొటోలు దిగడానికి పరమితమవుతున్నాయంటూ పరోక్షంగా మంత్రి విమర్శిస్తూ చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఎమ్మెల్యేగా తనకు తెలుసని.. ఆ సమస్యలను మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సింది తాను అని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రాకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. దీనిపై కలెక్టర్ స్పందించి సమాచార లోపంతో ఇలా జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అయినా శంకర్ నాయక్ వినిపించుకోక పోవడంతో మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఎమ్మెల్యే ముఖం చూడకుండానే అతడి వైఖరిని తప్పుబట్టారు. సమయానికి మీరు రాకుండా మాపై ఎగిరితే సరికాదని హితవు పలికారు. ఏదో జరిగిందని రాద్ధాంతం చేయడం సరికాదని తెలిపారు. సమావేశం మొత్తం ముఖం ఎమ్మెల్యేను చీదరించుకుంటూనే మంత్రి సమీక్ష చేశారు. ఎమ్మెల్యే తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వైఖరి మొదటి నుంచి గుండాలా ప్రవర్తిస్తున్నాడని, ఆయన అరచకాలు ఎక్కువయ్యాయని స్థానిక నాయకులతో పాటు ప్రజలు చెబుతున్నారు. ఆయన వైఖరిలో ఏమీ మార్పు ఉండడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మరి దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.