Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే కొడుకు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. గెలుపు ఎవరిది?

By:  Tupaki Desk   |   12 March 2021 7:08 AM GMT
ఎమ్మెల్యే కొడుకు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. గెలుపు ఎవరిది?
X
ఏపీలో ఇప్పుడంతా మున్సిపల్ పోరు హడావుడి నెలకొంది. పంచాయితీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మొదలైన పుర పోరుతో మళ్లీ రాజకీయం రాజుకుంది. అధికార.. విపక్షాలు పోటాపోటీ పడుతున్న వేళ.. రాష్ట్రంలోని మరెక్కడా లేనంత తీవ్రమైన పోటీ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. అనంత అధిక్యత లెక్క తేల్చనున్న ఈ ఎన్నికల ఫలితాన్ని ఇరు వర్గాల వారుప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమే కాదు.. ‘వ్యక్తిగతం’గా తీసుకోవటంతో ఇప్పుడు అక్కడ వాతావరణం హాట్ హాట్ గా మారింది.

ఈ ఎన్నికల్లోఅధికారపార్టీ తరఫున తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తుంటే.. ఆయనకు పోటీగా టీడీపీ నేత కమ్ మాజీ ఎమ్మెల్యేగా సుపరిచితుడైన జేసీ ప్రభాకర్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిద్దరు వేర్వేరు వార్డుల్లోపోటీ చేస్తూ.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.

మొత్తం 36వార్డులు ఉన్న తాడిపత్రిలో ఇప్పటికే రెండు వార్డుల్ని ఏకగ్రీవం పేరుతోవైసీపీ సొంతం చేసుకుంది. ఇందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 34 వార్డుల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగుతోంది.ఏ పార్టీ అయితే 19 వార్డుల్ని కైవశం చేసుకుంటుందో దానికే అధికారం దక్కనుంది. ఇటీవల కాలంలో జేసీ.. పెద్దారెడ్డికుటుంబాల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్లోసాగుతున్న వేళ.. ఈ ఎన్నిక రెండు కుటుంబాలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఎన్నిక ఫలితం ఈ నెల 14న వెల్లడి కానుంది. ఒకవేళ.. ఈ ఎన్నికల్లో జేసీ కానీ ఓడితే.. ఆయన రాజకీయ జీవితంలోఇంతకుమించిన ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదన్న మాట వినిపిస్తోంది. మరి తాడిపత్రి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.