Begin typing your search above and press return to search.
కడియం శ్రీహరికి మరో షాకిచ్చిన ఎమ్మెల్యే రాజయ్య
By: Tupaki Desk | 8 Sep 2022 12:30 AM GMTతాను రెండు సార్లు ఎమ్మెల్యేననని.. కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆరు నెలలు మాత్రమే అయ్యిందని.. మీకు ఏ పని కావాలన్న ఎమ్మెల్యే దగ్గరికి వస్తేనే అవుతుందని.. ఎమ్మెల్సీ కడియంతో ఏం కాదంటూ వివాదాస్పద టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ‘ఇద్దరినీ రెండు కళ్లలాగా చూసుకోండి.. ఒక వైపే చూస్తే కంటి చూపు పోతుంది’ అంటూ కడియం మద్దతుదారులకు రాజయ్య హెచ్చరికలు జారీ చేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది.
స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యే రాజయ్యకు, ఎమ్మెల్సీ సీనియర్ కడియం శ్రీహరికి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇటీవల కడియం శ్రీహరి ఏకంగా 361మంది నక్సలైట్లను అధికారంలో మంత్రిగా ఉండగా చంపించారని రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కడియం కూడా ధీటుగా స్పందించాడు. నీ చిల్లర వేషాలు.. చిలకొట్టుడు వ్యవహారాలు, అవినీతికి సంబంధించిన రికార్డులు అన్నీ నా దగ్గర ఉన్నాయని.. బయటపెడితే తట్టుకోలేవంటూ హెచ్చరించారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గొంతును పోలిన ఓ ఆడియో అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజయ్య ఓ మహిళతో మాట్లాడినట్టు ఉన్న ఆ ఆడియో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అయితే ఆ ఆడియోలో మాట్లాడిన మహిళ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కొందరు జర్నలిస్టులు ఆ మహిళ ఆచూకీ తెలుసుకుందామని వారి తల్లిదండ్రులను సంప్రదించగా.. తమకు తెలియదని.. ఎక్కడికో వెళ్లిపోయిందని సమాధానమిచ్చారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ కోసం కడియం, రాజయ్య పోటీపడ్డారు. కానీ కేసీఆర్ సీనియర్ కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీన్ని కడియం జీర్ణించుకోవడం లేదు. టీఆర్ఎస్ లోనే ఉన్నా అసమ్మతి రాజేస్తున్నారు. ప్రస్తుతం రాజయ్య వర్సెస్ కడియం వ్యవహారం నియోజకవర్గంలో రగులుతోంది.
ఇద్దరూ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ నియోజకవర్గంలో రెండుగా చీలారు. వీరి పంచాయితీని టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో రోజుకో మాటతో ఇద్దరి మధ్య సెగలు కక్కుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.