Begin typing your search above and press return to search.
ఒక్క టికెట్..నాలుగు కాంగ్రెస్ కండువాలు
By: Tupaki Desk | 18 Sep 2018 10:59 AM GMTతెలంగాణ పీసీసీ పెద్దలను ఓ నియోజకవర్గం తీవ్రంగా కలవరపెడుతోందట.. ఎమ్మెల్సీల ఫీవర్ ఆ పార్టీని వెంటాడుతోందట.. నిజామాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు కాంగ్రెస్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టికెట్ కోసం ఇద్దరూ ఎమ్మెల్సీలు నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తుండడం కాంగ్రెస్ ను షేక్ చేస్తోంది.
నిజామాబాద్ రూరల్ నుంచి పోటీపడుతున్న ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం ఎమ్మెల్సీ అయితే.. మరొకరు మాజీ ఎమ్మెల్సీ.. ఈ ఇద్దరూ వేరు వేరు పార్టీల నుంచి కాంగ్రెస్ లో టికెట్ ఆశించి చేరిన వారే..ఇద్దరూ నియోజకవర్గంలో బలమైన నేతలే.. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ కు సమస్యగా మారింది.
రాహుల్ గాంధీ సమక్షంలో టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి. డీ.శ్రీనివాస్ మద్దతున్న భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఇప్పటికే తాను నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేయబోతున్నట్టు భూపతిరెడ్డి ప్రకటించేశారు. ఇక రూరల్ లో ఎప్పటినుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్న అరికెల నర్సారెడ్డి ఈసారి అక్కడ గెలిచేందుకు స్కెచ్ గీశారు. ఈయన రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడే రూరల్ లో పోటీ చేస్తానని స్పష్టం చేశాడట.. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పించి సీటు తనకే తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట..
కాగా ఎంతోకాలంగా నిజామాబాద్ రూరల్ టీఆర్ ఎస్ ఇన్ చార్జిగా ఉన్న భూపతిరెడ్డి వైసీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన బాజిరెడ్డి కోసం సీటు త్యాగం చేశారు. ఆయనకు రూరల్ లో విశేషమైన కార్యకర్తల బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడంతో బాజిరెడ్డిని ఓడిస్తానని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.. గెలుపు అవకాశాలు కూడా భూపతి రెడ్డికే ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇటు భూపతి రెడ్డి - అటు నర్సారెడ్డి టికెట్ కోసం కొట్టుకుంటుండగా కాంగ్రెస్ లో ఆది నుంచి ఉన్న భూమారెడ్డి - నగేశ్ రెడ్డి లు మాత్రం తమకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారట.. కాంగ్రెస్ జెండాను ఆదినుంచి మోసిన తమకే సీటు ఇవ్వాలని.. బయట నుంచి వచ్చిన వారికి ఎలా ఇస్తారని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం భూపతిరెడ్డి - నర్సారెడ్డి మధ్యనే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది.