Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యేకు పోర్న్ వీడియోలు పంపిన యువతి!
By: Tupaki Desk | 2 Nov 2022 7:34 AM GMTనగ్నంగా ఓ యువతి చేసిన వీడియో కాల్‌కు సంబంధించి చిత్రదుర్గ బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిప్పారెడ్డిని హనీ ట్రాప్ చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించిందని.. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఈ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులను డిమాండ్ చేయడానికే ఓ యువతి ఇలా హనీట్రాప్ వల వేసిందని చెబుతున్నారు.
కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళ్తే.. ఎమ్మెల్యే తిప్పా రెడ్డికి అక్టోబర్ 31న గుర్తుతెలియని మహిళ నుంచి కాల్ వచ్చింది. మొదట్లో మామూలు కాల్ మాట్లాడింది. ఆ తర్వాత వాట్సాప్ లో వీడియో కాల్ చేసింది. మరోవైపు హిందీలో మాట్లాడుతున్న ఓ మహిళను చూసి బీజేపీ నేత షాక్ అయ్యారు.
వెంటనే, శాసనసభ్యుడు తిప్పారెడ్డి కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ మొబైల్ నంబర్ నుంచి అతనికి పలు పోర్న్ వీడియోలు వచ్చాయి. శాసనసభ్యుడు అన్ని వీడియోలను తొలగించి, నంబర్‌ను బ్లాక్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
దీంతో తిప్పారెడ్డి చిత్రదుర్గ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హనీ ట్రాప్‌లో ఆయన రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉందని సంబంధిత వర్గాలు అనుమానిస్తున్నాయి.
కాగా కర్ణాటకను హనీ ట్రాప్ ఉదంతం కుదిపేస్తోంది. ఇప్పటికే రామనగర జిల్లా మాగడిలోని బండేమఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. హనీట్రాప్ ద్వారా బసవలింగ స్వామీజీ యువతితో ఉన్న వీడియోలను సేకరించి కణ్ణూరు మఠాధిపతి మృత్యుంజయ స్వామీజీ భారీగా డబ్బు డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద గల వీడియో విడుదల చేస్తామని బసవలింగ స్వామిని బెదిరించాడు. ఈ ఉదంతంతో బసవలింగస్వామీజీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో దొడ్డబళ్లాపురంలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతి కీలకపాత్ర పోషించినట్టు తేలింది. ఆ యువతి మఠానికి వస్తూ పలువురు స్వామీజీలతో పరిచయాలు పెంచుకుందని చెబుతున్నారు. వారితో సన్నిహితంగా ఉంటున్న వీడియోలు తీసుకుని వారిని మృత్యుంజయ స్వామీజీకి ఇచ్చేదని అంటున్నారు. ఆ తర్వాత వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం బెదిరించేవారని తెలుస్తోంది. వీరి బారిన ఇలా ఎంతోమంది పడ్డారని పోలీసులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.