Begin typing your search above and press return to search.
ఆమెని ఎమ్మెల్యే కొడుకు వేదిస్తున్నాడట!
By: Tupaki Desk | 25 May 2020 2:02 PM GMTఈ మధ్య కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేధించే ఘటనలు ఎక్కువైపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నవభారత్ ఏరియాకు చెందిన భూక్య జ్యోతి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడిపై ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే కొడుకు రాఘవ అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం ఇచ్చి , తనకి న్యాయం చేయాలనీ కోరింది.
అలాగే , ఈ వ్యవహారం పై ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలేదు అని మంత్రికి తెలిపింది. దీనితో, ఈ ఘటన పై తక్షణమే స్పందించిన మంత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు అని, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని మంత్రికి.. ఎస్పీ తెలిపారని - ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయాలని - ఒక ఆడపిల్లపై ఇలాంటివి చేస్తే సహించేది లేదని - నిందితులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్పీకి తెలిపినట్టు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.