Begin typing your search above and press return to search.

ఎందుకు ఎమ్మెల్యే అయ్యానా... అని బాధ‌ప‌డుతున్నా.. వైసీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   10 Jan 2023 11:38 AM GMT
ఎందుకు ఎమ్మెల్యే అయ్యానా... అని బాధ‌ప‌డుతున్నా.. వైసీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఔను! ఇది నిజ‌మే. వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ''నేను ఎందుకు ఎమ్మెల్యే అయ్యానా? అని రోజూ బాధ‌ప‌డుతున్నా'' అని వ్యాఖ్యానించారు. తాను ఉన్నత కుటుంబం నుంచి వచ్చానని.. మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉంద‌ని చెప్పారు. గత 50 సంవత్స రాల నుంచి రాజకీయాల్లో ఉన్నాన‌ని చెప్పారు. కానీ అప్పటి రాజకీయాల్లో, ఇప్పటి రాజకీయాల్లో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయని వ‌సంత వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో పది మంది పోరంబోకులను వెంట వేసుకుంటేనే రాజకీయాల్లో ముందు అడుగు వేసే పరిస్థితి ఉంద‌ని ప‌రోక్షంగా సొంత పార్టీ నేత‌ను టార్గెట్ చేసి వ్యాఖ్యానించారు. ఇలా చేయ‌డం లేదు కాబ‌ట్టే.. తాను ఇంకా పాతతరం నాయకుడిగానే ఉన్నానన్నారు. మైలవరం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వ‌సంత కొన్నాళ్లుగా.. పార్టీ వ్య‌వ‌హార శైలికి భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఆ య‌న మైలవరం మండలం చంద్రాల సొసైటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన పార్టీలో పరిణామాలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారని.. 50 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తోందని చెప్పారు.

అప్పటితో పోల్చితే ప్రస్తుత రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని వివరించారు. రౌడీలను వెంటేసుకుని వారిలా ప్రవర్తిస్తేనే ముందడుగు వేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేను ఎందుకయ్యానా? అని రోజూ బాధపడుతున్నానని ఎమ్మెల్యే వ్యాఖ్యానిం చారు. గత మూడున్నరేళ్లలో తానెక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని, పథకాలు ఆపలేదని చెప్పారు. కేసుల విషయంలో కొంతమంది తమ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చని తెలిపారు. మొత్తానికి వైసీపీలో ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.