Begin typing your search above and press return to search.
గణేషుడికి వైసీపీ గండాలు.. పార్టీలో కొనసాగేనా..?
By: Tupaki Desk | 24 Feb 2022 12:30 AM GMTవాసుపల్లి గణేష్. విశాఖ దక్షిణం ఎమ్మెల్యే. టీడీపీలో సీనియర్ నాయకుడు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. ఇదే సాధారణ విజయం కాదు. వైసీపీ సునామీ, జగన్ పాదయాత్ర తాకిడిని కూడా తట్టుకుని ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. అనూహ్యంగా ఆయన వైసీపీకి మద్దతు పలికారు.
తన కుటుంబంతో సహా తాడేపల్లికి వచ్చి జగన్‌ను కలిసారు. తన కుమారుడిని కూడా పార్టీలో చేర్పించారు. అయితే.. ఇంత జరిగి ఏడాది కూడా పూర్తి కాకుండానే ఆయన వైసీపీలో గండాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా.. అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి వారికి ప్రత్యేకంగా ఆదరణ లభించడం లేదు. దీంతో వారు ఎమ్మెల్యేలపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు వారిని ఆర్థికంగా ఆదుకుంటున్న పరిస్థితి కూడా ఉంది.
అదేసమయంలో పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినా.. కార్యకర్తలతోనే చేయిస్తున్నారు. వారికే కొంత మొత్తం ముట్టజెపుతున్నారు. ఇక్కడ గణేష్ విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి కార్యకర్తలు కొందరు ఆర్థిక సాయం అడిగారు. దీంతో ఆయన పెద్ద మాటే అనేశారు.
చెదపురుగులు పట్టి పీల్చేస్తున్నాయి.. అన్నారు. దీంతో కార్యకర్తలు ఎదురు తిరిగారు. ఆయనకు నిరసనగా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు బయటకు రాని ఆయన బయటకు వచ్చి.. తేలుతీస్తా.. అంటూ.. మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. దీంతోఆయనను ఓడించాలని.. కార్యకర్తలు శపథం చేసుకున్నారు.
దీంతో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు గణేష్ సిద్ధమయ్యారు. కానీ, ఇంతలోనే కార్యకర్తలే ఈ విషయాన్ని పార్టీకి వివరించారు. ఇక, ముఖ్య నేత సాయిరెడ్డితోనూ గణేష్‌కు పొసగడం లేదు. ఆయన విశాఖకు వచ్చిన ప్రతిసారీ.. ఎయిర్‌పోర్టుకు వెళ్లి వైసీపీ నాయకులు స్వాగతం పలుకుతారు.
గతంలో పార్టీలో చేరిన కొత్తలో రెండుసార్లు వెళ్లిన గణేష్ తర్వాత.. రావడం లలేదు. అంతేకాదు.. సాయిరె డ్డి పాల్గొనే కార్యక్రమాలకు కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో సాయిరెడ్డి కూడా గణేష్‌పై గుస్సాగానే ఉన్నారు. ఇదిలావుంటే.. టీడీపీ నుంచి గణేష్‌కు ఆహ్వానాలు అందుతున్నాయి.
నువ్వు ఎప్పుడు వచ్చినా.. ద్వారాలు తెరిచే ఉండబడును! అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అంతేకాదు..నువ్వు ఏదో ఆశించి వెళ్లావు.. కానీ, అక్కడ పరిస్థితి నీకు అర్ధమయ్యే ఉంటుందని..టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో గణేష్ పార్టీలో ఇమడలేక.. టీడీపీలోకి వెళ్లిపోవడమే సరైందని భావిస్తున్నారట.