Begin typing your search above and press return to search.
సొంత పార్టీ నేత చేతులు నరికేస్తానంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం
By: Tupaki Desk | 18 Oct 2021 5:07 AM GMTగతానికి భిన్నంగా రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలన స్టేట్ మెంట్లు ఇవ్వటం ఈ మధ్యన ఎక్కువైంది. గతంలో విషయం ఎంత తీవ్రమైనా.. అనవసరమైన హడావుడి ప్రకటించేవారు కాదు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. తర్వాత ప్రజల రియాక్షన్ చూసి.. తమను పొగిడేవారికంటే తిట్టే వారు ఎక్కువైతే.. వెంటనే ఏదో ఒక కవరింగ్ ఇచ్చేసి వెళ్లటం ఈ మధ్యన ఒకఅలవాటుగా మారింది. తాజాగా పశ్చిమబెంగాల్ కు చెందిన నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఒక ప్లే గ్రౌండ్ ను సొంత పార్టీకి చెందిన నేతలే కబ్జా చేస్తున్న వైనంపై ఆయన తీవ్రంగా రియాక్టు అయ్యారు. ఉత్తర 24 పరగణా జిల్లా కమర్హతి ఎమ్మెల్యే మదన్ మిత్రా మాట్లాడుతూ.. స్థానిక ఎంపీతో కలిసి ప్లే గ్రౌండ్ ను సుందరీకరణ కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు. తాను అలా చేస్తుంటే అందులో అపార్ట్ మెంట్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కేసు పెట్టాలని కోరుతున్నారు. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిలో ముగ్గురు తనకు తెలుసని.. వారిపై కేసు పెట్టనున్నట్లు చెప్పారు.
పోలీసులు కానీ చర్యలు తీసుకోకపోతే.. సదరు ప్లే గ్రౌండ్ ను కాపాడుకోవటం కోసం ఉద్యమం చేస్తానని చెబుతున్నారు. ఒకవేళ తనను వాళ్లు కొనాలని చూసినా.. బెదిరింపులకు దిగినా తగ్గేదే లేదన్న అతను.. కబ్జాదారుల చేతుల్ని నరుకుతానని సంచంలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వార్నింగ్ ఇప్పుడు వివాదంగా మారింది. పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో తాను సీఎం మమతా బెనర్జీని కలుస్తానని చెబుతున్నాడు.
సొంత పార్టీ నేతల చేతుల్ని నరికేస్తానన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పెను దుమారం నడుస్తోంది. దీంతో.. తెలివిలోకి వచ్చిన సదరు ఎమ్మెల్యే తన ఘాటు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని.. ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్న ఆయన.. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. తనను క్షమించమని కోరారు. ఎమ్మెల్యేనే ఒకటికి రెండుసార్లు తనను క్షమించమని కోరటంతో ఇష్యూ ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.