Begin typing your search above and press return to search.
మృతదేహంతో ఎమ్మెల్యే.. ఏం చేశాడంటే
By: Tupaki Desk | 24 Aug 2021 11:30 PM GMTనేతలంటే సూటూ బూటు వేసుకొని దర్జా దర్పం ప్రదర్శించడం మాత్రమే కాదు.. ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకోవడం.. వారి అవసరాలు తీర్చడం.. కానీ అలాంటి నేతలు కొందరే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో పేరున్న రాజకీయ నాయకుల్లో చాలా సాదాసీదాగా కనిపించే నేతల్లో నిమ్మల రామానాయుడు ఒకరు. టీడీపీ నేత అయిన నిమ్మల తొలిసారి 2014లో తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2019లోనూ ఆయనే గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
టీడీపీలో సాధారణ ఎమ్మెల్యేగా కనిపించే నిమ్మలలో డాబు, దర్పం మచ్చుకైనా కనిపించవు. సైకిల్ వేసుకొని నియోజకవర్గంలో ఒక్కడే తిరిగేస్తుంటాడు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆయనకు సైకిలే వాహనంగా మారిపోయింది.
సైకిల్ యాత్ర చేస్తూ ఇంటింటికి వెళుతూ కరోనా బాధితులకు సరుకులు అందిస్తూ ప్రజల మనసులు గెలుచుకున్నాడు నిమ్మల. ఓ సందర్భంలో వర్షం పడుతున్నా కూడా సైకిల్ పైనే వెళ్లి సరుకులు అందజేయడం విశేషం.కొందరు ఎమ్మెల్యే నిమ్మల పబ్లిసిటీ కోసం చేస్తున్నాడని అని విమర్శించినా ఆయన మాత్రం ప్రజా సేవలో మొహమాటపకుండా సాధారణంగానే ప్రవర్తించారు.
తాజాగా నిమ్మల మరోసారి వార్తల్లో నిలిచాడు. తన చర్యలతో ఆకట్టుకున్నాడు. తన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోగా మృతదేహాన్ని తీసుకెళ్లే వాహనం నడపాల్సిన డ్రైవర్ కరోనా బారినపడడంతో ఇంకెవరూ వాహనం నడిపేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా ఆ వాహనాన్ని తనే నడుపుకుంటూ వైకుంఠ ధామం వద్దకు తీసుకెళ్లి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు కూడా ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని విమర్శించేవాళ్లూ ఉన్నారు. కానీ ఏ కోణంలో చూసినా ఇలా చేయడానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ముందుకు వస్తారన్నది ఆలోచించాల్సిందే. ఎమ్మెల్యే నిమ్మల తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.