Begin typing your search above and press return to search.

'కాకాని' గుర్తులు చెరిపేస్తున్నారు: ప్ర‌భుత్వంపై వైసీపీ ముఖ్య నేత ఫైర్‌

By:  Tupaki Desk   |   25 Dec 2022 1:52 PM GMT
కాకాని గుర్తులు చెరిపేస్తున్నారు:  ప్ర‌భుత్వంపై వైసీపీ ముఖ్య నేత ఫైర్‌
X
వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త కాకాని వెంక‌ట‌రత్నం గుర్తుల‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చెరిపివేస్తోం ద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాకాని వెంకటరత్నం ‌50వ వర్ధంతిని పుర‌స్క‌రించుకుని బెజ‌వాడ బెంజి స‌ర్కిల్ వ‌ద్ద‌.. ఆయ‌నకు నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా ర‌వి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర‌ ఉద్యమం సాగుతున్న స‌మ‌యంలోనే 180 ప్రభుత్వ పాఠశాలలను ఈ జిల్లాలో ఏర్పాటు చేయించారని కాకానిని ప్ర‌శంసించారు. దాతలను ప్రోత్సహించి ఎంతోమంది కి ఉచిత విద్య అందేలా చేశారని అన్నారు.

అటువంటి పాఠశాలలోనే నేను కూడా అక్షరాలు దిద్దానన‌ని చెప్పారు. విజ‌య‌వాడ‌లో కీల‌క‌మైన ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలు వెంకటరత్నం కృషి వల్లే వచ్చాయని చెప్పారు.

పటమట ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకుని పరిహారం అందజేశార‌ని.. కొంద‌రు పాల‌కుల మాదిరిగా వేధింపుల‌కు గురి చేయ‌లేద‌ని..య‌ల‌మంచిలి వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ ఆటోనగర్ ఆసియాలోనే పెద్దదిగా పేరు గాంచిందని, దీనిని ఏర్పాటు చేసింది కూడా.. వెంక‌ట‌ర‌త్న‌మేన‌న్నారు. విజయ డైరీ, బేకెన్ ఫ్యాక్టరీ, కో ఆపరేటివ్ బ్యాంకులు ఆయనే తెచ్చారని చెప్పారు.

అయితే.. అలాంటి మ‌హ‌నీయ వ్య‌క్తిత్వం ఉన్న నాయకుడిని నేడు ఈ ప్రభుత్వం రోడ్డు మీద పడేసే పరిస్థితికి తెచ్చిందని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సి వస్తోంద‌న్నారు.

బెంజిసర్కిల్ లో యాభై యేళ్లుగా ట్రాఫిక్ ఐలాండ్ ఉండేదని, విస్త‌ర‌ణ ప‌నుల‌తో పక్క‌న పెట్టార‌ని.. దుయ్య‌బ‌ట్టారు. కాగా, వైసీపీ లో ప్ర‌స్తుతం ఆయ‌న ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో జ‌న‌సేన‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.