Begin typing your search above and press return to search.

బీఫ్ తిని ప‌శు అమ్మ‌కాల‌పై చ‌ర్చించారు

By:  Tupaki Desk   |   8 Jun 2017 4:37 PM GMT
బీఫ్ తిని ప‌శు అమ్మ‌కాల‌పై చ‌ర్చించారు
X
కేంద్ర ప్ర‌భుత్వం ప‌శువుల అమ్మ‌కాల‌పై తీసుకొచ్చిన కొత్త నిబంధ‌న‌ల‌పై చ‌ర్చించ‌డానికి ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన సంద‌ర్భంగా కేర‌ళ అసెంబ్లీలోని స‌భ్యులు వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. పశు విక్రయాలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఇటీవల కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ఖాతరు చేయబోమని కేరళ ప్ర‌భుత్వం...త‌మ నిర‌స‌న తీర్మానానికి ముందు ఎమ్మెల్యేలకు ఫుల్లుగా బీఫ్ ఫ్రై తినిపించింది.

రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తోందంటూ ఆరోపించిన అధికార యూడీఎఫ్ తాజాగా అసెంబ్లీ తీర్మానం చేయ‌డానికి సిద్ధ‌మైంది. అసెంబ్లీలోకి వెళ్లే ముందు క్యాంటీన్‌ లో ఎమ్మెల్యేలు బీఫ్ తిన్నారు. అనంత‌రం అసెంబ్లీ స‌మావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధ‌న‌లు రాష్ట్రాల హ‌క్కుల‌కు భంగం క‌లిగించేవే అని అసెంబ్లీలో చ‌ర్చించారు. కేంద్ర తీసుకొచ్చిన కొత్త నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా కేర‌ళ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ ప్ర‌వేశ‌పెట్టారు. ఇష్ట‌మైన ఆహారం తిన‌కుండా వ్య‌క్తుల‌ను అడ్డుకోవ‌డం వాళ్ల ప్రాథ‌మిక హక్కుల‌కు భంగం క‌లిగించ‌డ‌మే అవుతుంద‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య‌న్ అన్నారు. కాగా, సాధార‌ణ అసెంబ్లీ స‌మావేశాల్లో ఉద‌యం 11 గంట‌ల త‌ర్వాతే బీఫ్ వ‌డ్డిస్తామ‌ని, అయితే బీఫ్ అంశంపై చ‌ర్చించ‌డానికే ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన నేప‌థ్యంలో ఉద‌యాన్నే ప‌ది కిలోల బీఫ్ తీసుకొచ్చి ఫ్రై చేశామ‌ని క్యాంటీన్ ఉద్యోగి ఒక‌రు తెలిపిన‌ట్లు మీడియా క‌థ‌నాలు తెలిపాయి.

కాగా, కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచీ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌ డీఎఫ్ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీఫ్ ఫెస్టివ‌ల్స్ నిర్వ‌హించింది. దీనికి ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ సైతం మ‌ద్ద‌తు ఇచ్చింది. త‌న సొంత నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో కాంగ్రెస్ అయితే ఓ అడుగు ముందుకేసి పబ్లిగ్గా ఓ దూడ‌ను చంపడం వివాదానికి కార‌ణ‌మైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/