Begin typing your search above and press return to search.
రాజస్థాన్ లో క్యాంప్ రాజకీయాల్లో విందు, వినోదాల పసందులో ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 9 Jun 2022 10:33 AM GMTకాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో కూడా నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో ప్రత్యర్థి పార్టీ బీజేపీ తన ఎమ్మెల్యేలను తన్నుకుపోకుండా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది.
నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థుల్ని రంగంలోకి దించగా.. బీజేపీ ఒకరిని పోటీలోకి దించింది. ఒక్కో ఎంపీ గెలవడానికి 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే, చివరి నిమిషంలో మీడియా దిగ్గజం, జీ మీడియా సంస్థల అధినేత సుభాష్ చంద్ర స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. సుభాష్ చంద్రకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. దీంతో బీజేపీ తరహా రాజకీయాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.
ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 109 మందితో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలను ఉదయ్ పూర్ లోని హోటల్‌కు వారం క్రితమే తరలించింది. అందరినీ ఒకేచోట ఉంచేలా ఎమ్మెల్యేలను జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసం నుంచి ఉదయ్‌పూర్‌కు లగ్జరీ బస్సులో తరలించారు. ఉదయ్ పూర్ హోటల్ లో వీరికి విందు, వినోదాలు, ఆటపాటలు, మంచి డ్యాన్సులతో ఖుషీనిస్తున్నారు.
దీంతో ఉదయ్ పూర్ లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వినోదభరిత కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడా అక్కడే ఉంచగా.. వారు కూడా ఆటపాటలతో రోజులు పొద్దుపుచ్చుతున్నారు. ఎమ్మెల్యేలు విందు వినోదాల్లో మునిగితేలుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఉదయ్‌పుర్‌లోని కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, మ్యాజిక్ షోలు వంటివాటితో ఉత్సాహంగా గడుపుతున్నారు.
ఉదయం వేళ జిమ్‌లకు వెళుతూ.. హోటల్‌లోని పచ్చని తోటల్లో షికార్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కొందరు ఈత కొలనులకు వెళుతుండగా.. మరికొందరు క్రికెట్ ఆడుతున్నారు. మహిళా సభ్యులు 'అంత్యాక్షరి' పాడుతున్నారు. ఈ హొటల్‌లో ఓ సినిమా థియేటర్ కూడా ఉండటంతో మరింత వినోదం అందుతోంది. అలాగే ప్రముఖ మెజీషియన్ అంచల్ తో ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు.
బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను 'శిక్షణ శిబిరం' పేరిట జైపూర్ లోని ఓ హోటల్‌కు తరలించింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయం యోగ, వ్యాయామాలు చేస్తున్నారు. ఈనెల 10న ఎన్నికలు జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గురువారం ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ నుంచి జైపూర్ కు తీసుకొచ్చి ఓ హోటల్‌కు తరలించే అవకాశం ఉంది. మరుసటిరోజు నేరుగా ఓటింగ్ కోసం అసెంబ్లీకి తీసుకెళతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ మిగిలిన మూడో స్థానం సాధించాలంటే మరో 15 ఓట్లు అవసరమవుతాయి. తమకు ఆ సంఖ్యాబలం ఉందని ఆ పార్టీ గట్టిగా చెబుతోంది. అయితే ఆ స్థానానికి బరిలో ఉన్న మీడియా ప్రముఖుడు సుభాష్‌చంద్రకు మద్దతిస్తున్న భాజపా ఆయన్ను గెలిపించుకోవాలంటే మరో 8 ఓట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.