Begin typing your search above and press return to search.

యూపీ ఎమ్మెల్యేల కోటీశ్వరుల రికార్డు చూస్తే షాకే

By:  Tupaki Desk   |   14 March 2017 11:52 AM GMT
యూపీ ఎమ్మెల్యేల కోటీశ్వరుల రికార్డు చూస్తే షాకే
X
ఉత్తరప్రదేశ్‌ తాజా అసెంబ్లీలో ఎన్నికయిన వారిలో దిమ్మతిరిగే కోటీశ్వరులు ఉన్నారట. మొత్తం గెలిచిన ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. వీరిలో బీఎస్పీకి చెందిన షాహ అలామ్‌ ఉర్ఫ్‌ గుడ్డు జమాలి (ముబారక్‌పూర్‌ ఎమ్మెల్యే) అంత్యంత ధనవంతుడు. ఇతని ఆస్తి విలువ రూ.118 కోట్లు. రెండో స్థానంలో వినరుశంకర్‌ (చిల్లాపూర్‌ ఎమ్మెల్యే, బిఎస్‌పి) వున్నారు. ఇతని ఆస్తి విలువ రూ. 67 కోట్లు. మూడో స్థానంలో వున్న రాణి పక్షాలికా సింగ్‌ (బీజేపీ) ఆస్తి విలువ రూ. 58 కోట్లు. అలాగే తాజా అసెంబ్లీలో 143 మందిపై క్రిమినల్‌ కేసులు వున్నాయి. వీరిలో 107 మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. 312 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 83 మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఇక విద్యార్హతల విషయానికి వస్తే...402 మంది మొత్తం ఎమ్మెల్యేల్లో 17 మంది డాక్టరేట్‌ డిగ్రీ కలిగివున్నారు. 110 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 163 మంది గ్రాడ్యుయేట్లు. 101 మంది సెంకడరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేశారు. ఎమ్మెల్యేల్లో ఇద్దరు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యేల్లో బిసౌలి నుంచి ఎన్నికైన కుషాగ్రా సాగర్‌ (బిజెపి) అత్యంత పిన్నవయస్కుడు (25 ఏళ్లు), అత్యంత వయస్సు వున్న ఎమ్మెల్యేలుగా రాజేష్‌ అగర్వాల్‌ (బరేలియా నియోజకవర్గం), దాల్వీర్‌ సింగ్‌ (బరౌలి) నిలిచారు. బిజెపి నుంచి ఎన్నికైన వీరి వయస్సు 73 ఏళ్లు.

ఈ ఎన్నికల్లో మరో రికార్డు నమోదయింది. అసెంబ్లీకి 38 మంది మహిళలు ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం తరువాత రాష్ట్ర అసెంబ్లీకి ఇంత మంది మహిళలు ఎన్నికకావడం ఇదే తొలిసారి. తాజా ఎన్నికల్లో వివిధ పార్టీలు మొత్తంగా 96 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చా యి. బీజేపీ 43 మందికి టిక్కెట్లు ఇవ్వగా 32 మంది విజయం సాధించారు. కాంగ్రెస్‌, బీఎస్పీ నుంచి చెరో ఇద్దరు - ఎస్‌ పి - అప్నాదళ్‌ నుంచి ఒక్కోక్కరు విజయం సాధించారు. స్వాతంత్య్రం తరువాత యుపి తొలి అసెంబ్లీకి 20 మంది మహిళలు ఎన్నికయ్యారు. 1985లో 31 మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/